PM Narendra Modi: మహాకాళ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Narendra Modi Inauguration the Mahakal Lok Corridor
x

PM Narendra Modi: మహాకాళ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

Highlights

PM Narendra Modi: రూ. 856 కోట్ల వ్యయంతో కారిడార్ నిర్మాణం

PM Narendra Modi: ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సంప్రదాయ దుస్తుల్లో మోడీ మహాకాళ్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మహాకాళ్ల లోక్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహాకాళ్ మందిరం విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా కాంతులీనింది. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు.

మొత్తం 856 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కారిడార్‌ను నిర్మించారు. దేశంలోనే అతిపెద్ద కారిడార్. దీని పొడవు 900 మీటర్లు. శిల్పకళ ఉట్టిపడేలా 108 స్తంభాలతో కారిడార్ నిర్మాణం జరిగింది. ఇక్కడ ఒకేసారి 2 లక్షల మంది భక్తులు శివుడ్ని దర్శించుకునే అవకాశముంది. మహాకాళ్ల మందిరం వద్ద మహాకాళ్ కారిడార్ ప్రారంభమవుతున్న వేళ మధ్యప్రదేశ్‌లోని వేలాది దేవాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories