PM MODI: కాశీ విశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు..గంగా హారతిలో పాల్గొన్న ప్రధాని.!

PM MODI: కాశీ విశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు..గంగా హారతిలో పాల్గొన్న ప్రధాని.!
x
Highlights

PM MODI: ప్రధానమంత్రిగా మూడోవసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ వారణాసికి చేరుకున్నారు. మంగళవారం కాశీవిశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీంతోపాటు దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొన్నారు.

PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేశారు.లోక్‌సభ ఎన్నికల తర్వాత తన నియోజకవర్గం వారణాసికి తొలిసారిగా వచ్చిన ఆయన కాశీవిశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లే ముందు, మెహదీగంజ్‌లో జరిగిన పీఎం కిసాన్ సమ్మన్ సమ్మేళన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం దశాశ్వమేధ్ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీకాంత్ మిశ్రా మంత్రోచ్ఛారణల మధ్య షోడశోపచార పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ప్రధానితో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జ్ఞాపికను అందజేశారు.


ట్విట్టర్ వేదికగా ప్రధాని ఓ పోస్టు చేశారు. "కాశీ విశ్వనాథ ఆలయంలో భారతదేశం పురోగతి 140 కోట్ల మంది భారతీయుల శ్రేయస్సు కోసం ప్రార్థించాను. మహాదేవుని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా'' అని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.‘‘కాశీలో విశ్వనాథుని పూజించిన తర్వాత నాకు ఎనలేని సంతృప్తి కలిగింది. దేశప్రజలందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ఆకాంక్షించారు. జై బాబా విశ్వనాథ్!'అంటూ ట్వీట్ చేశారు.

అనంతరం దశాశ్వమేధ ఘాట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గంగా హారతిలో పాల్గొన్నారు. అంతకుముందు కిసాన్ సమ్మేళనంలో, మోదీ తనను మూడవసారి లోక్‌సభకు పంపినందుకు వారణాసి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, "ఇప్పుడు గంగామాత నన్ను దత్తత తీసుకున్నట్లుగా ఉంది, నేను ఇక్కడకు చేరాను" అని అన్నారు . అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దశాశ్వమేధ ఘాట్‌కు చేరుకుని గంగా హారతిలో పాల్గొని గంగామాత ఆశీస్సులు తీసుకున్నారు. సూర్యాస్తమయం సమయంలో మోదీ రెడ్ కార్పెట్‌తో అలంకరించిన మెట్లు దిగి దశాశ్వమేధ ఘాట్‌కు చేరుకున్నారు. అర్చకుల వేద మంత్రాల మధ్య ప్రధాని మోదీ గంగాపూజ, హారతి నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories