PM Modi: నేడు 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ

PM Modi to Launch 5 Vande Bharat Trains Today
x

PM Modi: నేడు 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ

Highlights

PM Modi: ఏకకాలంలో 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ఏకకాలంలో 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి నేడు ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఉదయం 10:30 గంటలకు ప్రధాని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు.

దేశవ్యాప్తంగా వివిధ నగరాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లను మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఐసీఎఫ్ నిర్మించింది. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్‌పూర్, బెంగళూరు-హుబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టే ఐదు రైళ్లతో కలిసి దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories