West Bengal Elections: పదేళ్ల పాలనలో మమత సర్కార్‌ బెంగాల్‌కు చేసిందేమీ లేదు- మోదీ

Modi targets mamata Govt
x

మోడీ ఫైల్ ఫోటో (TheHansIndia)

Highlights

West Bengal Elections 2021: బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోడీ మమత బెనర్జీపై నిప్పులు చెరిగారు.

Modi Targets Mamata Government: బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోడీ మమత బెనర్జీపై నిప్పులు చెరిగారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం పంపిస్తున్ననిధులను మమత సర్కార్‌ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బెంగాల్‌లో మార్పు అనివార్యమని మోడీ పేర్కొన్నారు. బెంగాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని..సోనార్‌ బంగ్లా, ప్రగతిశీల్‌ బంగ్లా కావాలని పిలుపునిచ్చారు.

బెంగాల్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు మోడీ. కోల్‌కతాలో బ్రిగేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మమత సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ కోట్లాదిమందికి మంచినీరు అందడంలేదని విమర్శించారు. అనేక జిల్లాల్లో ఆర్సెనిక్‌ కలిసిన నీళ్లు బాలబాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యక ఉందని మోడీ అన్నారు.

బెంగాల్‌ ప్రజలు అభివృద్ధిపై పెట్టుకున్న ఆశల్ని తాము నెరవేరుస్తామన్నారు ప్రధాని మోడీ. బెంగాల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని.. రాష్ట్ర సంస్కృతిని కాపాడతామని హామీ ఇచ్చేందుకే బెంగాల్‌కు వచ్చానని తెలిపారు. ప్రతి క్షణం ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి బీజేపీ పనిచేస్తుందని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ.

కోల్‌కతాలో ప్రధాన మోడీ సభకు కౌంటర్‌గా సిలిగురిలో పాదయాత్ర నిర్వహించారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. గ్యాస్‌, పెట్రోధరల పెంపుకు నిరసనగా వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. గ్యాస్‌బండతో ర్యాలీలో పాల్గొన్నారు. గ్యాస్‌, పెట్రో ధరలను పెంచి దేశ ప్రజలను బీజేపీ దోచుకుంటోందని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories