PM Modi: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం

PM Modi Sensational Decision on Covid Vaccination
x

ప్రధాని మోదీ (ఫైల్ ఇమేజ్)

Highlights

PM Modi: ఇక దేశమంతా ఫ్రీ వ్యాక్సిన్ * జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికి టీకా

PM Modi: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశమంతట ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్టు మోడీ తెలిపారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికి టీకా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుంది. వ్యాక్సిన్ కేంద్రాల నుంచి కేంద్రమే కొని రాష్ట్రాలకు అందిస్తుంది. వ్యాక్సిన్ కోసం ఏ రాష్ట్రం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మోడీ పేర్కొన్నారు. ఉచిత టీకా వద్దనుకుంటే ప్రైవేట్ లో వేయించుకోవచ్చని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రిలు 150 సర్వీస్ ఛార్జీలతో అందిచాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పేదలకు అందిస్తున్న గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకు అందిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. నవంబర్ వరకు దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామన్నారు. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి 80శాతం మంది ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories