Vinesh Phogat: అనర్హత వేటుపై ప్రధాని మోదీ రియాక్షన్... 'సవాళ్ళను ఎదుర్కోవడం నీ నైజం...'

PM Modi Respond On Vinesh Phogat Olympics Disqualification
x

Vinesh Phogat: అనర్హత వేటుపై ప్రధాని మోదీ రియాక్షన్... 'సవాళ్ళను ఎదుర్కోవడం నీ నైజం...'

Highlights

వినేశ్ ఫోగ‌ట్ డిస్‌క్వాలిఫై అయిన నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. వినేశ్‌, నువ్వ చాంపియ‌న్ల‌కే చాంపియ‌న్‌ అంటూ ఆయ‌న ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లోభారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాములు అధిక భరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే వినేశ్ ఫోగాట్ డిస్‌క్వాలిఫై అయిన నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. వినేశ్‌, నువ్వ చాంపియ‌న్ల‌కే చాంపియ‌న్‌ అంటూ ఆయ‌న ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు.

‘‘వినేశ్‌.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం’’ అని మోదీ భరోసానిచ్చారు.

వినేశ్ విష‌యంలో భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉష‌తో ప్ర‌ధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. అస‌లు ఏం జ‌రిగిందో ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. అంత‌ర్జాతీయ ఒలింపిక్ సంఘం వ‌ద్ద త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని పీటీ ఉష‌ను మోదీ కోరిన‌ట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories