PM Modi pays tributes to Atal Bihari Vajpayee: వాజ్‌పేయికి ఘన నివాళులర్పించిన ప్రధాని మోడీ

PM Modi pays tributes to Atal Bihari Vajpayee: వాజ్‌పేయికి ఘన నివాళులర్పించిన ప్రధాని మోడీ
x
Highlights

PM Modi pays tributes to Atal Bihari Vajpayee: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. వాజ్‌పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మోడీ గుర్తు చేసుకున్నారు.

PM Modi pays tributes to Atal Bihari Vajpayee: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. వాజ్‌పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మోడీ గుర్తు చేసుకున్నారు. ప్రజాసంక్షేమానికి, దేశాభివృద్ధికి వాజ్‌పేయి ఎన‌లేని కృషి చేశార‌ని , ఆయన చేసిన సేవ‌ల‌ను దేశ‌ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మోడీ ట్వీట్ చేశారు. వాజ్‌పేయిని గుర్తుచేసుకుంటూ.. మోడీ ఒక వీడియోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆదివారం వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు స్టాల్ వార్ట్స్ మెమొరియల్ వద్ద నివాళులు అర్సించారు.

డిసెంబర్ 25, 1924 మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన వాజ్‌పేయి.. బీజేపీ నుంచి ప్రధాని అయిన తొలి నాయకుడు వాజ్‌పేయి. అతను భారతదేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1996, 1998 నుండి 1999 వరకు మరియు తరువాత 1999 మరియు 2004 మధ్య పూర్తి ఐదేళ్ల కాలపరిమితికి ప్రధానిగా పనిచేశారు. మిత్రపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారం హస్తగతం చేసుకున్న నేత వాజ్‌పేయి. ప్రధానిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసిన తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్‌పేయి నిలిచారు. ఆయన పదవీకాలంలోనే భారతదేశం 1998లో మే 11 మరియు మే 13న పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించింది. వాజ్‌పేయి 1977 మరియు 1979 లలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. వాజ్‌పేయికి భారతప్రభుత్వం 2014లో భారతరత్న బిరుదుతో సత్కరించింది. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో 93 ఏళ్ల వయసులో ఆగష్టు 16, 2018న మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories