PM Surya Ghar: కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.. ప్రధాని కీలక ప్రకటన

PM Modi Launches Muft Bijli Free Electricity Scheme Shares Link To Join
x

PM Surya Ghar: కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.. ప్రధాని కీలక ప్రకటన

Highlights

PM Surya Ghar: పీఎం సూర్య ఘర్-ముఫ్త్​బిజిలీ పేరుతో పథకం

PM Surya Ghar: మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. పీఎం సూర్య ఘర్: ముఫ్త్​ బిజిలీ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. ఇందుకోసం 75 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ పథకంతో కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది కేంద్రం.

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉచిత కరెంట్​పై దృష్టి సారిస్తున్న ఎన్డీయే సర్కార్... ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టనుంది. స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించే ఏర్పాట్లు చేస్తోంది. సూర్య ఘర్ వల్ల జనానికి ఆదాయం రావడమేగాక కరెంటు బిల్లు భారం తప్పనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories