ప్రధాన మోడీ కిలక ప్రకటన ఆగస్టు 2 నుంచి ...

PM Modi has Announced that August 2 to August 15 it is proposed to keep the Tricolor Flag as a DP on Social Media Profiles
x

ప్రధాన మోడి కిలక ప్రకటన ఆగస్టు 2 నుంచి ...

Highlights

PM Modi: మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు

PM Modi: ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్‌కు ఆయన నివాళుర్పించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఒక సామూహిక ఉద్యమంలా మారుతోందని, అందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. మరోవైపు ఆటబొమ్మల ఎగుమతిలో ఇండియా పవర్‌హౌస్‌గా మారుతోందని వెల్లడించారు. బొమ్మల ఎగుమతి 2వేల 600 కోట్లకు పెరిగిందని మోడీ వివరించారు. ఆగస్ట్ 2న మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోసించారని మోడీ గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories