భారతలో ఇవాళ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను మోదీ ప్రారంభించారు. గత ఏడాది ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది..
గత ఏడాది చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇక మన దేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఈ ప్రాణాంత వైరస్ కారణంగా లక్షన్నర మంది ప్రాణాలు కొల్పొయారు. అయితే ఈ మహ్మారి జయించడానికి చాలా దేశాలు టీకాలు కనుగొనే పనిలో పడ్డాయి. మరి కొన్ని దేశాలు వ్యాక్సిన్ కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో భారతలో ఇవాళ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కరోనా పోరులో గతేడాది ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా లక్షల మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు నిర్విరామంగా పనిచేశారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విధుల కోసమని వెళ్లిన సిబ్బందిలో కొంతమంది ఇంటికి తిరిగి రాలేదు అని చెబుతూ ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యాధి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, కరోనా కారణంగా ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రుల్లో చేరిన వృద్ధులను వారి కుటుంబసభ్యులు కలుసుకోలేకపోయారని తెలిపారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు.
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చిందన్నారు. లాక్‌డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం అంత సాధ్యమైన పనికాదు. కానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కరోనా ఎదుర్కొనే పనిలో ప్రజలు కలికట్టుగా ఉన్నారని మోదీ అన్నారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. విదేశీ టీకాలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే ఈ టీకాలు లభిస్తున్నాయి. అంతేగాక, సాధారణ ఉష్ణోగ్రతల్లోనూ వీటిని భద్రపరిచే వీలుందని మోదీ చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్‌పై వదంతులు నమ్మొద్దని దేశ ప్రజలను కోరారు. వ్యాక్సిన్లు వచ్చినా.. ప్రజలు జాగ్రత్తలు మరవొద్దని ప్రధాని మోదీ సూచించారు.
వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించాలన్నారు. చైనాలో వైరస్ విజృంభించిన తర్వాత అక్కడ చిక్కుకుపోయిన తమ పౌరులను తీసుకొచ్చేందుకు అనేక దేశాలు ఇబ్బందిపడ్డాయి. వారిని స్వదేశాలకు తీసుకురాలేకపోయాయి. కానీ భారత్ ముందుకొచ్చింది. వందే భారత్ మిషన్ ద్వారా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులనే గాక, ఇతర దేశాల ప్రజలను కూడా అక్కడి నుంచి బయటకు తీసుకురాలగలిగిందని మోదీ వెల్లడించారు.
India is guided by a human-centric approach that will always work to further global good. #LargestVaccineDrive pic.twitter.com/hGC0WKTnvT
— Narendra Modi (@narendramodi) January 16, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire