PM Modi: తల్లిమరణంపై భావోద్వేగంతో మోడీ ట్వీట్

PM Modi Emotional Tweet On His Mother Heeraben
x

PM Modi: తల్లిమరణంపై భావోద్వేగంతో మోడీ ట్వీట్

Highlights

PM Modi: అమ్మలో త్రిమూర్తులను చూశా

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి హీరాబెన్ కన్నుమూశారు. రెండ్రోజుల క్రితం ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆహ్మదాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రధాని మోడీ అహ్మదాబాద్ బయలుదేరారు.

తల్లిమరణంపై మరణంపై భావోద్వేగంతో మోడీ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందన్నారు. అమ్మలో త్రిమూర్తులను చూశానని, అమ్మ నిస్వార్థానికి చిహ్నమని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇటీవలే వందో పుట్టిన రోజును హీరాబెన్ పూర్తి చేసుకున్నారు. వందో పుట్టిన రోజు తల్లి దీవెనలు మోడీ తీసుకున్నారు. మంచి బుద్ధితో పనిచేస్తూ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపు అంటూ ప్రధానితో తల్లి హీరాబెన్ చివరి మాటలు మాట్లాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories