PM MODI: ప్రపంచానికి భారత్ బౌద్ధాన్నిచ్చింది..యుద్ధాన్ని కాదు:ప్రధాని మోదీ

pm-modi-attend-the-india-community-event-in-austria
x

PM MODI: ప్రపంచానికి భారత్ బౌద్ధాన్నిచ్చింది..యుద్ధాన్ని కాదు:ప్రధాని మోదీ

Highlights

PM MODI: ఆస్ట్రియాలో ప్రధాని మోదీ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రష్యా, ఆస్ట్రియా పర్యటనను ముగించుకుని భారత్ కు చేరుకున్నారు.

Prime Minister Narendra Modi's visit to Austria:భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన తర్వాత ఆస్ట్రియాలో పర్యటించారు. ఆస్ట్రియాలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆస్ట్రియాలో ఇది నా మొదటి పర్యటన అని పేర్కొన్నారు. ఇక్కడ నేను చూస్తున్న ఉత్సాహం అద్భుతమైనదని అన్నారు.భారత్ ఎప్పుడూ సర్వమానవాళి శాంతి, సామరస్యాలే కోరుకుందని మోదీ తెలిపారు. ప్రపంచానికి భారత్ బౌద్ధాన్ని ఇచ్చిందని..యుద్దాన్ని కాదన్నారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను మరింత పటిష్టంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.

ప్రపంచ దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. భారత్ ఆలోచనలు, పనులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని ప్రధాని తెలిపారు. వేలఏండ్లుగా భారత్ తమ నైపుణ్యాన్ని, విజ్నానాన్ని ప్రపంచంతో పంచుకుంటుందని గుర్తు చేశారు. తద్వారా యుద్ధానికి బదులు, శాంతి సామరస్యాన్ని ప్రచారం చేస్తోందని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత్ ను విశ్వబంధుగా చూస్తోందన్నారు. అందరి మనందరికీ ఎంతో గర్వకారణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

భారత్ పై తన భవిష్యత్ ప్రణాళికలను మోదీ ప్రకటించారు. దేశాన్ని మూడోఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 2047 నాటికి భారత్ అభివ్రుద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తర్వాత వెయ్యేండ్ల పాటు అభివ్రుద్ధి చెందిన, బలమైన దేశంగా కొనసాగేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. భౌగోళికంగా భారత్, ఆస్ట్రియా రెండు వేర్వేరు కోణాల్లో ఉన్నాయని, అయితే మా మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని, ప్రజాస్వామ్యం మా ఇద్దరినీ కలుపుతుందని, స్వేచ్ఛ, సమానత్వం, బహువచనం, చట్టబద్ధత పట్ల గౌరవం మనది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

200 ఏళ్ల క్రితమే వియన్నాలో సంస్కృతం బోధించారని ప్రధాని చెప్పారు. 1880లో ఇండాలజీకి స్వతంత్ర చైర్‌ను ఏర్పాటు చేయడంతో ఇది మరింత ఊపందుకుంది. మోదీ మాట్లాడుతూ..“ఈరోజు నాకు కొంతమంది ప్రముఖ ఇండాలజిస్ట్‌లను కలిసే అవకాశం లభించింది. వారి చర్చల నుండి వారు భారతదేశంపై గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నారని స్పష్టమైంది. నేడు, 150 కంటే ఎక్కువ ఆస్ట్రియన్ కంపెనీలు భారతదేశంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్నాయి. ఆస్ట్రియన్ కంపెనీలు అనేక ప్రాజెక్టులలో పనిచేస్తున్నాయి. రానున్న కాలంలో ఇక్కడి కంపెనీలు భారత్‌లో విస్తరిస్తాయని అంచనా అని మోదీ అన్నారు.

దేశం సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ, నేడు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం బుద్ధుడిని ఇచ్చిందని, యుద్ధం కాదని, భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, శ్రేయస్సు గురించి మాట్లాడుతుందని అన్నారు. భారతదేశం నేడు ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ. మేము మొదటి మూడు స్థానాలకు చేరుకుంటాము. 2014లో భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories