పీఎం కిసాన్‌ 12 విడత డబ్బులు రాలేదా.. కొత్త రూల్‌ని గమనించండి..!

PM Kisan Latest News 12th Tranche Money Not coming Know this Matter
x

పీఎం కిసాన్‌ 12 విడత డబ్బులు రాలేదా.. కొత్త రూల్‌ని గమనించండి..!

Highlights

పీఎం కిసాన్‌ 12 విడత డబ్బులు రాలేదా.. కొత్త రూల్‌ని గమనించండి..!

PM Kisan: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం కిసాన్‌ యోజన కింద 12 విడత డబ్బులని రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. మీరు కూడా లబ్ధిదారులైతే వెంటనే మీ అకౌంట్‌ స్టేటస్‌ని చెక్‌ చేయండి. అలాగే ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజనలో పెద్ద మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇది దాదాపు 12 కోట్ల మంది రైతులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఏ నిబంధన మార్చారో తెలుసుకుందాం.

పీఎం కిసాన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. ఆధార్ నంబర్ ద్వారా స్టేటస్‌ని చెక్‌ చేయలేరు. మీ స్టేటస్‌ని తెలుసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం తప్పనిసరి చేసింది. వాస్తవానికి గతంలో రైతులు ఆధార్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా తమ స్టేటస్‌ని తెలుసుకునేవారు. తర్వాత మొబైల్ నంబర్ నుంచి కాకుండా ఆధార్ నంబర్ ద్వారా స్టేటస్‌ని చూడవచ్చని రూల్ వచ్చింది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఆధార్ నంబర్ ద్వారా స్టేటస్‌ చూడలేరు. మొబైల్ నంబర్ ఎంటర్‌ చేయడం తప్పనిసరి చేసింది.

1.దీని కోసం ముందుగా pmkisan.gov.inకి వెళ్లండి.

2.ఎడమవైపు ఉన్న చిన్న బాక్స్‌లో బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.

3.ఇప్పుడు మీ ముందు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.

4.ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా స్టేటస్‌ని తనిఖీ చేయండి.

5.మీకు రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే 'రిజిస్ట్రేషన్ నంబర్‌ను తెలుసుకోండి' అనే లింక్‌పై క్లిక్ చేయండి.

6.ఇందులో PM కిసాన్ ఖాతాతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

7.తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. మొబైల్ OTPని పొందండిపై క్లిక్ చేయండి.

8.ఇచ్చిన బాక్స్‌లో మీ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్‌ చేయండి. వివరాలను పొందండిపై క్లిక్ చేయండి.

9.ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్, పేరు మీ ముందు ఉంటుంది.

ప్రధానమంత్రి కిసాన్ యోజన

ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రూ.6,000 నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తారు. ఇది రూ.2,000 చొప్పున మూడు వాయిదాలలో చెల్లిస్తారు. ఇందులోభాగంగా ఇప్పటి వరకు 12వ విడత రైతుల ఖాతాల్లోకి చేరింది. మీ ఖాతాకు ఇంకా డబ్బు బదిలీ కానట్లయితే ముందుగా మీ స్టేటస్‌ ఏంటో తెలుసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories