PM Ayushman Bharat Yojana: పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఉచితంగా కార్పొరేట్ వైద్యం.. ఇదిగో ఆస్పత్రుల లిస్ట్

PM Ayushman Bharat Yojana: పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఉచితంగా కార్పొరేట్ వైద్యం.. ఇదిగో ఆస్పత్రుల లిస్ట్
x
Highlights

PM Ayushman Bharat Yojana: పేదల కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

PM Ayushman Bharat Yojana: పేదల కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి మరిన్ని ప్యాకేజీలను చేర్చాలని కేంద్రం యోచిస్తోంది. రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ చికిత్సలతో పాటు 1,949 వైద్య సేవలను ఇప్పటికే పథకంలో చేర్చారు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు వారాల పాటు మందులు అందించడం, ఆసుపత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు చేసిన రోగనిర్ధారణ పరీక్షల ఖర్చును పరిగణనలోకి తీసుకోవడం ఈ పథకంలో ఉంది. లబ్ధిదారులకు ఆహారం, వసతితో సహా ఆసుపత్రి సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది.

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 70 ఏళ్లు పైన వయస్సు ఉండే వారికి ఉచితంగా రూ. 5 లక్షల వరకు వైద్య సేవలు లభించనున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మందికి ఈ లబ్ధి చేకూరనుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి కొన్ని మానసిక-ఆరోగ్య చికిత్సలు కూడా ప్రస్తుత పథకం కిందకు వస్తాయి.

సెప్టెంబర్ 1 నాటికి, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మినహా దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 12,696 ప్రైవేట్ ఆసుపత్రులతో సహా 29,648 ఆసుపత్రులలో ఆయుష్మాన్ భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు 7.37 కోట్ల మంది ఆసుపత్రుల్లో చేరగా, వీరిలో 49 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ పథకం ద్వారా ప్రజలు కోటి రూపాయలకు పైగా లబ్ధి పొందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది.

పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. మరి ఈ స్కీం హాస్పిటల్ లిస్ట్ ఎలా చూడాలనేది ఇప్పుడు తెలుసుకోండి.

ఆయుష్మాన్ కార్డు ఉన్నవారికి ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన (Pradhan Mantri Ayushman Bharat Yojana) కింద నమోదైన హాస్పిటల్స్‌లో మాత్రమే ఉచిత చికిత్స పొందే వీలుంటుంది. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ యోజన హిస్పిటల్ లిస్ట్ చూడటానికి ఆయుష్మాన్ యోజన వెబ్‌సైట్‌ విజిట్ చేస్తే సరిపోతుంది. pmjay.gov.in లోకి వెళ్లి ఫైండ్‌ హాస్పిటల్‌ ఆప్షన్‌‌పై క్లిక్ చేయాలి. ఆపై మీ రాష్ట్రం, జిల్లా, ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రైవేట్ ఆసుపత్రి వంటి వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఎంపానెల్‌మెంట్ టైప్‌లో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్‌ చేయాలి. అప్పుడు స్క్రీన్‌పై ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన హిస్పిటల్స్ లిస్ట్ కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories