అయోధ్యలో ప్లాస్టిక్‌ నిషేధం

Plastic Ban in Ayodhya
x

అయోధ్యలో ప్లాస్టిక్‌ నిషేధం

Highlights

Ayodhya: టెంపుల్‌ సిటీని క్లీన్‌సిటీగా ఉంచేందుకు ఏర్పాట్లు

Ayodhya: ఈనెల 22న అయోధ్యలో శ్రీరామాలయం ప్రారంభోత్సవానికి భారీగా భక్తులు తరలి రానున్నారు. భక్తుల కోసం అయోధ్యలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. ముఖ్యంగా టెంపుల్‌ సిటీని క్లీన్‌ సిటీగా ఉంచడానికి యోగీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దుకాణాల యజమానులు, హోటల్స్‌ యజమానులతో సమావేశమైన అధికారులు అయోధ్యను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేసేందుకు సహకరించాలని కోరారు. దీంతో అయోధ్యలో అవసరమైన ప్లేట్లు, గిన్నెలు, ఆలయంలో ప్రసాదం పెట్టేందుకు చిన్న దొప్పల తయారీ యూనిట్‌ను అయోధ్యలోనే ఏర్పాటు చేశారు.

ప్రత్యేక ముడిసరుకుతో తయారయ్యే ఈ ప్లేట్లు మట్టిలో ఈజీగా కలిసి పోతాయని, వీటిని పొరపాటున జంతువులు తిన్నా కూడా ఏమీ కాదని.. పూర్తిగా జీర్ణమవుతుందని అధికారులు చెప్తున్నారు. ప్లేట్ల తయారీ ‍ యూనిట్‌ మూడు షిప్టుల్లో 24 గంటలూ పనిచేస్తోంది. దీంతో అయోధ్యను క్లీన్‌ సిటీగా ఉంచే లక్ష్యం నెరవేరుతుందని స్థానికులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories