డిసెంబర్‌లో లాక్‌డౌన్‌పై క్లారిటీ

డిసెంబర్‌లో లాక్‌డౌన్‌పై క్లారిటీ
x
Highlights

కరోనాతో పాటు దేశంలో వేగంగా విస్తరిస్తోంది ఏదైనా ఉంది అంటే.. అవి రూమర్లే ! జరిగింది ఒకటైతే.. ఇంకోటి అర్ధం చేసుకొని.. మరొకటి సోషల్ మీడియాలో పెడుతుంటారు...

కరోనాతో పాటు దేశంలో వేగంగా విస్తరిస్తోంది ఏదైనా ఉంది అంటే.. అవి రూమర్లే ! జరిగింది ఒకటైతే.. ఇంకోటి అర్ధం చేసుకొని.. మరొకటి సోషల్ మీడియాలో పెడుతుంటారు కొంతమంది ! దీంతో ఏది నిజమో.. ఏది అబద్దమో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఐతే కరోనా కట్టడికి డిసెంబర్‌ 1నుంచి దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించనున్నారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐతే ఇదంతా అసత్యమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో స్పష్టం చేసింది. కోవిడ్ కేసులు తీవ్రమౌతున్న కారణంగా డిసెంబర్‌ 1 నుంచి మరోసారి లాక్‌డౌన్‌ విధించనుందని ఓ ప్రముఖ మీడియా సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ప్రచారం జరుగుతుండగా పీఐబీ కొట్టిపారేసింది. ఆ ట్వీట్ నకిలీదని ప్రభుత్వం ఆ విధమైన నిర్ణయాలేవీ తీసుకోలేదని ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories