దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌

Phase 2 of Covid-19 vaccination drive ongoing
x

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌

Highlights

మహమ్మారి కరోనాను తరిమేందుకు స్వదేశంలో తయారైన టీకాను అందరూ వేసుకోవాలని కేంద్ర మంత్రులు భరోసాను కల్పిస్తున్నారు. స్వయంగా తామే టీకా వేసుకుంటున్నారు....

మహమ్మారి కరోనాను తరిమేందుకు స్వదేశంలో తయారైన టీకాను అందరూ వేసుకోవాలని కేంద్ర మంత్రులు భరోసాను కల్పిస్తున్నారు. స్వయంగా తామే టీకా వేసుకుంటున్నారు. ఎలాంటి భయం లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. నిన్న ఎయిమ్స్ కెళ్లి స్వయంగా కరోనా టీకా వేసుకున్నారు ప్రధాని మోడీ. మహమ్మారి పై జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మన డాక్టర్లు, సైంటిస్టులు సాగిస్తున్న కృషి ప్రశంసనీయమని ట్వీట్ చేశారు.

దేశ వ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. అందులో భాగంగా కేంద్ర మంత్రులు నేరుగా వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తన సతిమణీతో కలిసి టీకా వేయించుకున్నారు.

ఇటు తెలంగాణలోనూ రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు టీకా తీసుకుంటున్నారు. మొదటి రోజు హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో కరోనా టీకా తీసుకున్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. ‎ఇవాళ హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కొవిడ్‌ను జయించాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు కిషన్‌రెడ్డి.

దేశంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అలాగే 45 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. కోవిడ్ పోర్టల్‌కు వెళ్లి పేరు నమోదు చేసుకోవడం ద్వారా టీకా వేయించుకోవచ్చు. వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునేవారు తమ పేరును ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు కోవిడ్‌ పోర్టల్ లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ప్రభుత్వ హాస్పిటల్, వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా వాక్సిన్ ఇస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అయితే డోస్‌కు 250 రూపాయలు వసూలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories