నాలుగో రోజు స్థిరంగా పెట్రోలియం ధరలు

Petroleum prices remained stable for the fourth day
x

ఫైల్ ఇమేజ్


Highlights

Delhi:దేశంలో పెట్రో ధరలు వరుసగా నాలుగో రోజు స్థిరంగా, నిలకడగా కొనసాగుతున్నాయి.

Delhi:దేశంలో పెట్రో ధరలు వరుసగా నాలుగో రోజు స్థిరంగా, నిలకడగా కొనసాగుతున్నాయి. పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ ఎగువన కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది..ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత పది రోజుల్లో పెట్రోల్ ధర నాలుగు రూపాయల 87 పైసలు, డీజిల్ ధర 4 రూపాయల 99 పైసలు చొప్పున పెరిగింది..మరోవైపు రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి 101 రూపాయల 59 పైసలు వద్దకు చేరింది..ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17 పైసలు, డీజిల్ 81 రూపాయల 47 పైసలు వద్దకు చేరాయి...ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 57 పైసలు వద్దకు చేరింది. ...ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు..డీజిల్ 88 రూపాయల 86 పైసలు వద్ద కొనసాగుతున్నాయి...

Show Full Article
Print Article
Next Story
More Stories