Petrol Price Hike in India: 20వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు

Petrol Price Hike in India: 20వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు
x
Highlights

కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఇంధన సంస్థలు మాత్రం కనికరించడం లేదు. వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌...

కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఇంధన సంస్థలు మాత్రం కనికరించడం లేదు. వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి.పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెంచాయి. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 82.96 రూపాయలు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు 80.13కు, డీజిల్‌ లీటర్‌కు 80.19 రూపాయలు చేరాయి.

పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ధరల సవరణ పేరుతో మార్కెటింగ్‌ కంపెనీలు ఆయిల్‌ ధరలను పెంచుతున్నాయి. కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారుల ఆందోళన . పెట్రో ధరలను మించి డీజిల్‌ ధర పరుగులు తీయడంతో నిత్యావసరాల ధరలూ చుక్కలు చూస్తాయనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.8.93, డీజిల్‌పై రూ.10.07 పైసలు పెరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories