Petrol, Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, Diesel Prices 5th, May 2021 in Hyderabad, Vijayawada, Delhi, Mumbai, Chennai, Telangana, Andhra Pradesh
x

Petrol, Diesel Prices Today:(File Image)

Highlights

Petrol, Diesel Rates Today: ఇంతకాలం నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.

Petrol, Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెరగ్గా.. లీటర్ డీజిల్‌పై 18 పైసలు పెరిగాయి. దాంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55 కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 80.91కి చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు...

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.80.91 లకు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.76 ఉండగా.. డీజిల్ ధర రూ.83.78 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.95 కు లభిస్తుండగా.. డీజిల్ రూ.87.98 లకు లభిస్తుంది. చెన్నైలోనూ చమురు ధరలు ఇలాగే ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 92.55 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.85.90 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రో రేట్ రూ. 93.67 గాఉండగా.. డీజిల్ ధర రూ.85.87 గా ఉంది. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ కాస్ట్ రూ. 96.84 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.89.32 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16 లకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ.88.25 లకు చేరింది. కరీంనగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.31 ఉండగా.. డీజిల్ ధర రూ.88.39 లకు చేరింది. మెదక్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.84కి చేరింది. డీజిల్ ధర రూ.88.89 లకు చేరింది. నల్లగొండలో లీటర్ పెట్రోల్ ధ రూ. 94.68 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.72 గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16 లకు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ రూ.88.25 లకు లభిస్తోంది. వరంగల్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 93.75 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.95 గా ఉంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చమురు ధరలు పెరిగాయి. ఏపీలో ప్రధాన నగరమైన విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.46కి చేరింది. డీజిల్ ధర రూ.90.4 లకు చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.73 లకు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ రూ.89.31 లకు లభిస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.12 ఉండగా.. డీజిల్ ధర రూ.89.72 గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 96.46 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.90.04 లకు లభిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories