Supreme Court: సుప్రీంకోర్టులో సీఏఏ నిబంధనలు నిలిపివేయాలంటూ పిటిషన్లు

Petitions To Suspend CAA Regulations In Supreme Court
x

Supreme Court: సుప్రీంకోర్టులో సీఏఏ నిబంధనలు నిలిపివేయాలంటూ పిటిషన్లు

Highlights

Supreme Court: స్టే విధించరాదని కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా

Supreme Court: సీఏఏలోని నిబంధనలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ పిటిషన్‌పై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తుండగా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకు సీఏఏ నిబంధనలపై స్టే విధించరాదని తుషార్ మెహతా డిమాండ్ చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని కోరగా… తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేస్తూ.. ఈ పిటిషన్లపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories