TGPSC Group1: సుప్రీంకోర్టు చేరిన తెలంగాణ గ్రూప్ -1 వివాదం..పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్

Petition to postpone Telangana Group-1 exams in Supreme Court
x

TGPSC Group1: సుప్రీంకోర్టు చేరిన తెలంగాణ గ్రూప్ -1 వివాదం..పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్

Highlights

TGPSC Group1: తెలంగాణ గ్రూప్ 1 వివాదం ఇప్పుడు దేశ అత్యున్నత ధర్మాసనం వద్దకు చేరింది. గ్రూప్ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. అటు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‎లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది.

TGPSC Group1: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై న్యాయపరమైన విదాలు కొనసాగుతున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో డివిజిన్ బెంచ్ లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. మరోవైపు సోమవారం నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై విచారణను సోమవారం చేడతామని ప్రకటించింది కోర్టు.

అటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. హైకోర్టు డివిజన్ బెంజ్ లో పిటిషన్ పాస్ ఓవర్ కావడంతో వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈనెల 21 నుంచి తెలంగాణలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13ఏళ్లుగా తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలు జరగలేదు. 2023లో ప్రిటిమినరీ పరీక్షలు జరిగినా పేపర్ లీక్ కారణంగా అవి క్యాన్సిల్ అయ్యాయి. ఆ తర్వాత పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నారు.

ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

గత రెండు రోజులుగా కొంతమంది అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories