Gas Cylinder: ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. ఎలా పొందాలో తెలుసా?

Paytm bumper offer chance to get gas cylinder for free
x

Gas Cylinder: ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. ఎలా పొందాలో తెలుసా?

Highlights

Gas Cylinder: ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. ఎలా పొందాలో తెలుసా?

Gas Cylinder: కరోనా వల్ల బిల్లు చెల్లింపులన్ని ఆన్‌లైన్‌ అయిపోయాయి. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్ పే, అమెజాన్‌ పే లాంటి డిజిటల్‌ ప్లాట్‌ ఫాంల ద్వారా చెల్లిస్తున్నారు. దీనివల్ల గంటల తరబడి ఎదురుచూడకుండా పనులు తొందరగా అవుతున్నాయి. ఎంతో సమయం కూడా ఆదా అవుతుంది. దీంతో ఆ కంపెనీలు కూడా యూజర్ల కోసం కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా పేటీఎం వినియోగదారుల కోసం బంపర్‌ ఆఫర్‌ని ప్రకటింంచింది. మీరు పేటీఎం నుంచి ఎల్పీజీ గ్యాస్‌ బుక్ చేసుకుంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ను పొందే అవకాశం కల్పించింది.

మొదటి డీల్ కింద యూజర్లు రూ.25 డిస్కౌంట్‌ను పొందవచ్చు. రెండో ఆఫర్ కింద రూ.30 పేటీఎం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఇక మూడో ఆఫర్ కింద ఉచితంగానే యూజర్లు ఎల్‌పీజీ సిలిండర్‌ను యూజర్లు పొందవచ్చు. అయితే కంపెనీ ఒక షరతు విధించింది. పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే యూజర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. రూ.25 డిస్కౌంట్ కావాలనుకుంటే, ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకున్న వెంటనే మీకు లభిస్తుంది. ఒకవేళ రూ.30 క్యాష్ బ్యాక్ అయితే పేటీఎం క్యాష్ రూపంలో పొందవచ్చు. బుకింగ్ సమయంలో వీటి కోసం పేటీఎం పలు ప్రోమోకోడ్లను ఆఫర్ చేస్తుంది.

అయితే ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్ పొందాలనుకునే వారికి ప్రత్యేక ప్రోమోకోడ్‌ ఉంటుంది. యూజర్లు బుకింగ్ సమయంలో 'ఫ్రీ సిలిండర్' అనే ప్రోమోకోడ్‌ను వాడాలి. సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో పూర్తి మొత్తాన్ని యూజర్లు చెల్లించాలి. పేటీఎం వాడుతూ ప్రతి 100 వ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి ఈ పూర్తి క్యాష్‌బ్యాక్‌ను లభిస్తుంది. గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంటే యూజర్లు కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుది. ఫిబ్రవరి 28, 2022 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories