TOP 6 News @ 6PM: అల్లు అర్జున్ అరెస్ట్‌, సంధ్య థియేటర్ ఘటన, నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

TOP 6 News @ 6PM: అల్లు అర్జున్ అరెస్ట్‌, సంధ్య థియేటర్ ఘటన, నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
x
Highlights

Pawan Kalyan reaction on Allu Arjun arrest issue: సంధ్య థియేటర్ ఘటనపై, అల్లు అర్జున్ అరెస్ట్, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు.

1) Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌, సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan reaction on Allu Arjun arrest issue: సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. మీడియాతో చిట్ చాట్‌లో ఈ ఘటనపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం పుష్ప 2 టీమ్ నుండి ఎవరైనా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదని సూచించారు. అక్కడే మానవత్వం లోపించినట్లుగా కనిపించిందన్నారు. అది చేయకుండా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

పుష్ప 2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనే కారణంతోనే ఆయన్ను అరెస్ట్ చేశారనడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిది ఆ స్థాయి కాదని, ఆయన అంతకు మించిన బలమైన నేత అని చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పుష్ప 2 మూవీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం అందుకే జరిగిందన్నారు.

2) Pawan Kalyan: రాజకీయాల్లో పనితీరే ముఖ్యం.. నాగబాబు మంత్రి పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan about Nagababu minister post: సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో పనితీరు మాత్రమే ప్రామాణికమని.. కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. అమరావతిలో మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్న పవన్.. నాగబాబుకు మంత్రిపదవి ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాకు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారని.. తర్వాత జనరేషన్‌కు ఒక అండగా మారామని చెప్పారు. నాగబాబు నాతో సమానంగా పనిచేసి.. వైసీపీ వాళ్లతో తిట్లు తిన్నారని గుర్తుచేశారు. పార్టీ కోసం నిలబడ్డారని చెప్పారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదు.. పనిమంతుడా? కాదా? అన్నది చూడాలన్నారు.

కందుల దుర్గేష్‌ది ఏ కులమో కూడా తెలియదన్నారు. కేవలం పనితీరు ఆధారంగా మంత్రి పదవి కేటాయించినట్టు తెలిపారు. నాగబాబును మొదట రాజ్యసభకు అనుకున్నాం. అక్కడ కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ అనుకున్నాం. నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. తర్వాత మంత్రి పదవిపై చర్చిస్తామన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే ఎమ్మెల్సీ కాకముందు మంత్రిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ అలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఏమీ లేవని.. అందువల్ల నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాలని అన్నారు.

3) MP Priyanka Gandhi: బిహార్‌ విద్యార్థులపై లాఠీఛార్జ్.. ప్రభుత్వ తీరుపై విమర్శలు

MP Priyanka Gandhi condemned police lathi charge on students in Bihar: బీహార్‌లో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఖండించారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలిలో విద్యార్థులపై వాటర్ కెనాన్స్ ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. బీహార్‌లో మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండు సార్లు విద్యార్థులపై దాడులకు దిగిందని అన్నారు.

పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్‌లు, పేపర్ లీక్‌లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయాన్ని నితీష్ ప్రభుత్వం (Bihar Govt) మరిచిపోయిందని ప్రియాంక విమర్శించారు. జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అభ్యర్థులు పోరాడుతుంటే వారిని అణచివేయడానికి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ యత్నిస్తుందని ప్రియాంక మండిపడ్డారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) Income Tax Slab: బడ్జెట్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించి కీలక ప్రకటన.. 15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఉపశమనం..!

Income Tax Slab: ఆదాయపు పన్నులో ఉపశమనం కోసం దేశంలోని వేతన తరగతి నుండి ప్రతి సంవత్సరం డిమాండ్ ఉంటూనే ఉంది. గత ఏడాది కూడా ప్రజలు పన్ను శ్లాబులను మార్చాలని ఆర్థిక మంత్రిని కోరారు. అయితే ఈసారి పన్ను నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మధ్యతరగతి ప్రజలకు పెద్ద పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వార్షికాదాయం రూ.15 లక్షల వరకు ఉన్న వారికి ఈ ఉపశమనం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ఫిబ్రవరి 1, 2025న సమర్పించే బడ్జెట్‌లో ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ప్రకటించవచ్చని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఆదాయపు పన్నుపై భారీ సడలింపు నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, మరింత ఖర్చు చేయడానికి ప్రజలను ప్రోత్సహించడానికి ఒక ప్రణాళిక. ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం సులభం అవుతుంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) India vs Australia 4th Test: భారత్ ఓటమి

India vs Australia 4th Test: అస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు ఓడింది. 340 టార్గెట్ చేరుకోవడంలో భారత జట్టు బ్యాట్స్ మెన్ విపలమయ్యారు. 155 పరుగులకే భారత బ్యాట్య్ మెన్ పెవిలియన్ చేరారు. భారత్ పై 184 పరుగుల తేడాతో అస్ట్రేలియా విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 తేడాతో అస్ట్రేలియా ముందంజలో ఉంది.

భారత బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జైశ్వాల్ 84, పంత్ 30 పరుగులు చేశారు. రోహిత్ 9, కోహ్లి 5, ఆకాశ్ దీప్ 7, జడేజా 2, నితీశ్ రెడ్డి 1 పరుగు చేసి ఔటయ్యారు. కేఎల్ రాహుల్, బుమ్రా, సిరాజ్ డకౌట్ అయ్యారు. 2025 జవరి 3న సిడ్నీలో చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

6) Suchir Balaji: ఆత్మహత్య చేసుకొన్నట్టు లేదు... ఎలాన్ మస్క్

సుచిర్ బాలాజీ (Suchir Balaji) మరణంపై ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదని ఆయన అన్నారు. ఈ ఏడాది నవంబర్ 26న సుచిర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు.అయితే దీనిపై సుచిర్ తల్లి అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియా పెట్టిన పోస్టుకు మస్క్ స్పందించారు.

సుచిర్ తల్లి అనుమానాలు ఇవీ... సుచిర్ మరణానికి సంబంధించి ఆయన తల్లి పూర్ణిమారావ్ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రైవేట్ ఇన్వేస్టిగేటర్‌ను నియమించుకొని పోస్టుమార్టం నిర్వహిస్తే పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా రిపోర్టు ఉందని ఆమె తెలిపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories