TOP 6 News @ 6PM: దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీవ్ర ఉద్రిక్తత.. కలెక్టర్ ప్రకటన

TOP 6 News @ 6PM: దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీవ్ర ఉద్రిక్తత.. కలెక్టర్ ప్రకటన
x
Highlights

Pawan Kalyan: ప్రధాని మోదీతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ 1)Pawan Kalyan meets PM Modi in parliament PMO: ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన...

Pawan Kalyan: ప్రధాని మోదీతో భేటీ అయిన పవన్ కళ్యాణ్

1)Pawan Kalyan meets PM Modi in parliament PMO: ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని పీఎంఓలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీకీ రావాల్సిన నిధులు, పలు పథకాల నిర్వహణలో కేంద్రం నుండి అందాల్సిన ఆర్థిక సాయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జలజీవన్ మిషన్ పథకం పొడిగించాల్సిందిగా పవన్ కోరినట్లు సమాచారం. అలాగే జలజీవన్ మిషన్ పథకం నిర్వహణ కోసం కేంద్రం నుండి నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రధానితో భేటీ కంటే ముందుగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తోనూ సమావేశమయ్యారు. ఇదే పర్యటనలో ఏపీ బీజేపి చీఫ్ పురందేశ్వరి, టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఒంగోలు ఎంపీ), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసాపురం ఎంపీ) పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్ తో వీరి భేటీ మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది.

2) పరవాడ ఫార్మాసిటీలో విష వాయువులు లీక్.. విచారణకు ఆదేశించిన చంద్రబాబు

Anakapalli Parawada Pharmacity Incident: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబోరేటరీస్ నుండి విష వాయువు లీకై ఒడిషాకు చెందిన అమిత్ అనే 22 ఏళ్ల కార్మికుడు మృతి చెందారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ఘటనలో 9 మంది అస్వస్థతకు గురవగా వారిలో అమిత్ అనే యువకుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటన గురించి సంబంధిత అధికారుల వద్ద ఆరాతీశారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతంలో ఇదే తరహాలో విష వాయువులు లీక్ అవడం, రియాక్టర్లు పేలడం వంటి వేర్వేరు ఘటనల్లో ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. అందుకే సీఎం చంద్రబాబు వెంటనే అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

3) Ethanol Factory: దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల నిలిపివేత: కలెక్టర్

Ethanol Factory: నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. కలెక్టర్ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తులతో కలెక్టర్ చర్చలు జరిపారు. అనంతరం ఇథెనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫ్యాక్టరీకి అనుమతులు వచ్చాయి. కానీ తాజాగా స్థానికుల నుండి వ్యతిరేకత వస్తుండటంతో ఇథెనాల్ ఫ్యాక్టరీ అనుమతులపై ప్రస్తుత ప్రభుత్వం పున:సమీక్ష చేయాలని నిర్ణయానికి వచ్చిందని నిర్మల్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

4) బీఆర్ఎస్ నొక్కేసిన భూములు బయటికి తీస్తాం - మల్లు భట్టివిక్రమార్క

Mallu Bhatti Vikramarka about BRS and Dharani Portal: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పోర్టల్‌లో అక్రమ పద్ధతిలో మార్పులుచేర్పులు చేసి ఆ పార్టీ నేతలు వేల ఎకరాల భూములు నొక్కేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ ఇష్టారీతిన కాజేసిన ఆ వేల ఎకరాల భూముల వివరాలు బయటికి తీస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. అవన్నీ తమ ప్రభుత్వ పనితీరు గిట్టిని వారు చేసే పసలేని విమర్శలు మాత్రమేనన్నారు. హైడ్రా, మూసీ నది ప్రక్షాళన విషయంలో అన్ని విషయాలు ఆలోచించాకే ముందుకు పోతున్నట్లు భట్టి తెలిపారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణను పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

5) మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు లైన్ క్లియర్ ?

Eknath Shinde About Maharashtra CM post: మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ వీడింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ఏర్పాటుకు తాను అడ్డంకి కాదని షిండే ప్రకటించారు. మహాయుతి కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ (అజిత్ పవార్), శివసేన (ఏక్ నాథ్ షిండే) వర్గం నాయకులతో బీజేపీ నాయకత్వం చేసిన సంప్రదింపులు ఫలించినట్టుగా సమాచారం. షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను ఢిల్లీకి రావాలని బీజేపీ నాయకత్వం ఆదేశించింది. గురువారం ఢిల్లీలో అమిత్ షాతో ఈ ముగ్గురు నేతలు భేటీ కానున్నారు. అక్కడ చర్చల తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. డిసెంబర్ 2న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

6) ఇజ్రాయెల్‌తో యుద్ధం చాలా డేంజరస్ ఫేజ్ - లెబనాన్ పార్లమెంట్ స్పీకర్

Israel - Hezbollah ceasefire agreement: ఇజ్రాయెల్‌తో యుద్ధం లెబనాన్ దేశ చరిత్రలోనే అతి ప్రమాదకరమైన దశ అని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ నబి బెర్రి అన్నారు. లెబనాన్ గడ్డపై హోజ్బొల్లా - ఇజ్రాయెల్ డిఫెన్స్ బలగాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తరువాత నబి బెర్రి ఈ వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ ఆపద్ధర్మ ప్రధాని నజీబ్ మికాటి స్పందిస్తూ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరారు. లెబనాన్ లో ఇజ్రాయెల్ ఆక్రమించిన భూభాగం నుండి బలగాలను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories