Top 6 NEWS @ 6PM: జగన్ ఇలాకాలో పవన్ కళ్యాణ్... మీకు నేనున్నానని భరోసా
1) Pawan Kalyan in Kadapa: జగన్ ఇలాకాలో పవన్ కళ్యాణ్... మీకు నేనున్నానని భరోసాPawan Kalyan comments on YS Jagan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ...
1) Pawan Kalyan in Kadapa: జగన్ ఇలాకాలో పవన్ కళ్యాణ్... మీకు నేనున్నానని భరోసా
Pawan Kalyan comments on YS Jagan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కడపకు వచ్చారు. కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను చదవుల నేలకు వచ్చానని అన్నారు. ఏపీలో అత్యధిక లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇదేనని పవన్ గుర్తుచేశారు. అన్నమయ్య, యోగి వేమన, కేవి రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంటి మహనీయులు పుట్టిన నేల ఇది అని చెప్పుకొచ్చారు.
కడపలో ఇప్పటికీ నీటి సమస్య ఉందని తెలిసి విస్తుపోయానని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతం నుండి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కనుక ఇక ఇక్కడి ప్రాంత ప్రజల కష్టాలు తీరాయని అనుకున్నానని అన్నారు. ఇప్పటికే పులివెందుల తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 45 కోట్ల నిధులు ఇచ్చాం. ఇకపై ఇక్కడ తాగు నీటి సమస్య లేకుండా చేసి ఈ ప్రాంత ప్రజలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించడమే లక్ష్యంగా తమ కూటమిప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా ఈ పేరెంట్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
2) Telangana Thalli statue: కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar meets KCR: తెలంగాణ రాజకీయాల్లో నేడు ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఎల్లుండి డిసెంబర్ 9 నాడు సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు వెళ్లి ప్రభుత్వం తరపున కేసీఆర్‌ను ఆహ్వానించారు.
మరోవైపు తెలంగాణ గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను, రూపు రేఖలను రేవంత్ రెడ్డి సర్కారు మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అందుకే విగ్రహంలో మార్పులు చేసినట్లు ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) CBI: విశాఖపట్టణం కంటైనర్ లో డ్రగ్స్ లేవని తేల్చిన సీబీఐ
Visakhapatnam Port: విశాఖపట్టణం కంటైనర్ లో డ్రగ్స్ లేవని సీబీఐ తేల్చింది. ఈ ఏడాది మార్చిలో ఈ కంటైనర్ విశాఖకు చేరుకుంది. ఆ సమయంలో ఈ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయని అప్పట్లో ప్రచారం సాగింది. దీనిపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ కంటైన్ లో 25 వేల టన్నుల డ్రైడ్ ఈస్ట్ లో డ్రగ్స్ ఉన్నాయని అప్పట్లో సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఈ శాంపిల్స్ ను దిల్లీలోని ల్యాబ్ కు పంపించారు. అయితే ఈ శాంపిల్స్ ను పరిశీలించిన ల్యాబ్ ఇందులో ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవని తేల్చింది. ఈ రిపోర్ట్ ను సీబీఐ అధికారులు కోర్టుకు అందించారు. ఈ కంటైనర్ ను సంధ్యా ఆక్వాకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టారు. 2024 మార్చి 16న కంటైనర్ లో ఇది చేరుకుంది. దీనిపై ఇంటర్ పోల్ సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు కంటైనర్ ను తనిఖీ చేశారు. ఇందులోని శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కు పంపారు. ఎనిమిది నెలల తర్వాత ఇందుకు సంబంధించిన నివేదిక ల్యాబ్ అందించింది. ఈ కంటైనర్ అంశం అప్పట్లో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ ల మధ్య విమర్శలకు దారి తీసింది.
4) AP Rains: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీ, తమిళనాడులకు మరో ముప్పు
AP Rains: ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది డిసెంబర్ 12వ తేదీ నాటికి శ్రీలంక తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబర్ 12న తమిళనాడుతోపాటు రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దానిపై స్పష్టత వస్తుందన్నారు.
నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూపోతుటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు తెలంగాణలో అక్కడక్కడా జల్లుల్లు, ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
5) Syria Crisis: సిరియాలో తిరుగుబాటుదారుల యుద్ధం.. భారతీయులకు కేంద్రం హెచ్చరికలు
Syria Crisis: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటున్నారు. రష్యా, ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం కుప్పకూలే దశకు చేరుకుంటోంది. ఒక్కో నగరాన్ని కోల్పోతోంది. దాదాపు దశాబ్ధం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి.. గత కొన్నేళ్లుగా స్తబ్ధంగా ఉన్న సిరియాలో తిరుగుబాటు దారులు మళ్లీ రెచ్చిపోయారు.
బషర్ అల్-అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాల్ని వెనక్కి నెడుతూ ఇప్పటికే పలు కీలక పట్టణాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇక తిరుగుబాటుదారుల తదుపరి లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నగరాన్ని కూడా ఆక్రమిస్తే సిరియా పూర్తిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది.
6) రెండో టెస్టులో చెలరేగిన ట్రావిస్ హెడ్... టీమిండియా తడబాటు
IND vs AUS 2nd test match Day 2 score highlights: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆసిస్ బ్యాటర్స్ చెలరేగిపోగా టీమిండియా బ్యాటర్స్ మరోసారి తడబడ్డారు. మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆసిస్ స్కోర్ 86/1 వద్ద ఉండగా రెండో రోజు ఆసిస్ ఆటగాళ్లు స్కోర్ బోర్డును ఉరకలెత్తించి 337 పరుగులకు ఆలౌటయ్యారు. ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సెక్సులు బాది 140 పరుగులతో ఆసిస్ స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. జస్ ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 4 వికెట్లు పడగొట్టారు. నితిన్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ తరువాత టీమిండియాపై ఆసిస్ జట్టు 157 పరుగుల తేడాతో ఆధిక్యంలో ఉంది.
ఆ తరువాత టీమిండియా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ ఆటగాళ్ల తడబాటు కారణంగా యశస్వి జైశ్వాల్ (24) శుబ్‌మన్ గిన్ (28) కేఎల్ రాహుల్ (7), విరాట్ కోహ్లీ (11) రోహిత్ శర్మ (6) ఇలా స్వల్ప స్కోర్‌కే టీమిండియా కీలకమైన వికెట్స్ నష్టపోయింది. ప్రస్తుతం రిషబ్ పంత్ (28), నితీశ్ కుమార్ రెడ్డి (15) పరుగులతో నాటౌట్ గా కొనసాగుతున్నారు. ఇక టీమిండియా కూడా ఈ ఇద్దరు బ్యాటర్స్ పైనే ఆశలు పెట్టుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో టెస్టులో మొత్తంగా టీమిండియా 29 పరుగులతో వెనుకబడింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire