కరోనాకు మందు విడుదల చేసిన బాబా రాందేవ్

కరోనాకు మందు విడుదల చేసిన బాబా రాందేవ్
x
Highlights

కరోనా వైరస్ కు చెక్ పెట్టే ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసింది పతంజలి సంస్థ. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని పంతజలి యోగా పీఠ్ వేదికగా.. ప్రముఖ యోగా గురువు...

కరోనా వైరస్ కు చెక్ పెట్టే ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసింది పతంజలి సంస్థ. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని పంతజలి యోగా పీఠ్ వేదికగా.. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ చేతుల మీదుగా ఈ మెడిసిన్‌ను లాంచ్‌ చేశారు. కోరోనిల్ పేరుతో ఈ మెడిసిన్‌ను రిలీజ్ చేశారు. 'కరోనిల్'‌ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ..కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.

ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం' అని రాందేవ్‌ పేర్కొన్నారు. 150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు. క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories