Tamil Nadu Airport: అతడి లగేజీపై డౌట్​.. చెక్​ చేస్తే 47 కొండచిలువలు.. రెండు బల్లులు..

Passenger lands With 47 Pythons And 2 Lizards At Trichy Airport Detained
x

Tamil Nadu Airport: అతడి లగేజీపై డౌట్​.. చెక్​ చేస్తే 47 కొండచిలువలు.. రెండు బల్లులు.. 

Highlights

Tamil Nadu Airport: ప్రయాణికుడిని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు

Tamil Nadu Airport: తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువలు, బల్లులు దర్శనమిచ్చాయి. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేస్తున్న కస్టమ్స్ అధికారులు.... కొండచిలువలను చూసి కంగుతిన్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌ను తనిఖీ చేశారు అధికారులు. అందులో సజీవంగా ఉన్న కొండచిలువలు, బల్లులను గుర్తించారు. బ్యాగులో మొత్తం 47 కొండ చిలువలు, 2 బల్లులు సజీవంగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories