Parliament Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు

Parliament Session From Today
x

Parliament Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు

Highlights

Parliament Session: ఏప్రిల్ 6 వరకూ కొనసాగనున్న సమావేశాలు

Parliament Session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని అధికార బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అదాని వ్యవహారం,. రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. దీనిపై ఇవాళ ఉదయం ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి.

అదానీ–హిండెన్‌బర్గ్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్ చేయనున్నట్టు ప్రతిపక్షాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసు, లాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసుల గురించి పార్లమెంట్ లో చర్చిస్తామని తెలిపాయి. పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకూ కొనసాగుతాయి.సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories