ఈరోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session Starts From Today
x

పార్లమెంట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

* ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ *బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ * కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ సభల నిర్వహణ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టీ నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో పార్లమెంట్‌ ఉభయసభలు నిర్వహించనున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సారి రెండు దశల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి15 వరకు మొదటి దశ, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండోదశ సమావేశాలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11గంటలకు బడ్జెట్ సమర్పిస్తారు. అయితే బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ చేసే ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తామని 18 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓ ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేసింది. కాంగ్రెస్ సహా 16 పార్టీలు ప్రెసిడెంట్ స్పీచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు.

మరోవైపు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షలు పట్టుబడుతున్నాయి. ముంబై టీఆర్‌పీ స్కాం, బాలాకోట్ మెరుపు దాడుల గురించి అర్ణబ్ గో స్వామి వాట్సప్ సంభాషణలపై ప్రతిపక్షాలు నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ పది డిమాండ్లు పెట్టింది. అందులో ప్రధానంగా వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని కోరనుంది.

కరోనా కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. సెప్టెంబర్ 24తో వర్షకాల సమావేశాలు ముగిశాయి అయితే బడ్జెట్ సమావేశాలు సరిగా వినియోగించుకోవాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలకు కోవిడ్ పరీక్షలు చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడితో సహా పెద్దల సభకు సంబంధించిన 1209 మంది సిబ్బంది కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. సభా కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధంలేని 715 మంది యాంటీజెన్ పరీక్షలు చేయించుకున్నారు. అందరీకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories