Pakistan Violates ceasefire in J&K: మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

Pakistan Violates ceasefire in J&K: మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
x
Highlights

Pakistan Violates ceasefire in J&K: పాకిస్థాన్ బుద్ధి కుక్కతోక వంకర తీరే అన్నట్టుగా ఉంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా పదే పదే కయ్యానికి కాలు దువ్వుతోంది.

Pakistan Violates ceasefire in J&K: పాకిస్థాన్ బుద్ధి కుక్కతోక వంకర తీరే అన్నట్టుగా ఉంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా పదే పదే కయ్యానికి కాలు దువ్వుతోంది. సరే పాకిస్థాన్ సరదా మనవాళ్ళు ఎందుకు కాదంటారు.. వారిపై ఒకచూపు చూశారు. ఆదివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా ఫార్వర్డ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరిపినట్లు ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. గత 24 గంటల్లో ఇది రెండవ ఉల్లంఘన అని ఆయన అన్నారు. సరిగ్గా రాత్రి 7.45 గంటల సమయంలో బాలకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట చిన్న ఆయుధాలతో కాల్పులు జరపడం తోపాటు మోర్టార్లతో షెల్లింగ్ కు పాల్పడ్డారని చెప్పారు. అయితే ఇందుకు భారత దళాలు కూడా ప్రతీకారం తీర్చుకున్నాయని జమ్మూకు రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్ల్ దేవేందర్ ఆనంద్ వెల్లడించారు.

కాగా పాకిస్తాన్ దళాలు రాకిచిరి, దేవాస్ మరియు నికియల్ సెక్టార్‌లోని బాగసార్‌లోకి ప్రవేశించి దాడులకు పాల్పడడంతో భారత భద్రతా దళాలు ప్రతీకారంగా శనివారం పాకిస్తాన్ సుబేదార్ సహా ఇద్దరు సైనికులను మట్టుబెట్టింది. అంతేకాదు జూలై 3 న రాఖికారిలోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఈ సమయంలో ఇద్దరు భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. శుక్రవారం కాల్పుల విరమణను ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ చికారి ప్రాంతంలో ఉన్న పోస్టులను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ప్రతీకారంగా జరిపిన కాల్పులలో బలూచ్ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు సైనికులు మరణించారు.. అనేక మంది గాయపడ్డారు. ఈ సమయంలో పాకిస్తాన్ కు చెందిన అనేక బంకర్లు కూడా ధ్వంసమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories