Arindam Bagchi: ఆఫ్ఘన్‌ నుంచి భారత్‌కు ఎంతమంది వచ్చారంటే..? విదేశాంగశాఖ ప్రకటన

Over 550 People Evacuated from Afghanistan Says Arindam Bagchi
x

Arindam Bagchi: ఆఫ్ఘన్‌ నుంచి భారత్‌కు ఎంతమంది వచ్చారంటే..? విదేశాంగశాఖ ప్రకటన

Highlights

Arindam Bagchi: ఆప్ఘనిస్తాన్లో శాంతి కోరుకుంటున్నామని భారత్ స్పష్టం చేసింది.

Arindam Bagchi: ఆప్ఘనిస్తాన్లో శాంతి కోరుకుంటున్నామని భారత్ స్పష్టం చేసింది. తాజా పరిణామాలు మరింత కలవరపెడుతున్నాయని, ఆప్ఘన్ నుంచి భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటి వరకూ 500 మందిని తరలించామని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అందులో 260 మంది భారతీయులు ఉన్నారని..ఇప్పటికే రోజుకు రెండు విమానాలు పెట్టి తరలిస్తున్నామని, మరిన్ని ఏజెన్సీల ద్వారా కూడా తరలింపు పూర్తి చేస్తామని అన్నారు.

భారతీయుల వీసాలను ఉగ్రవాదులు దొంగిలించిన కారణంగా వీసా ప్రోసెస్ ను మరింత కఠినతరం చేశామని ఈ - వీసాల ద్వారానే దేశంలోకి అనుమతిస్తున్నామని అన్నారు. అయితే, ఆఫ్ఘన్‌లో ఉన్న మెజార్టీ భార‌తీయుల‌ను ఇప్పటికే త‌ర‌లించిన‌ట్లు తాము భావిస్తున్నాం అన్నారు అరింద‌మ్ బాగ్చి. కానీ, మరికొందరు అక్కడ ఉండొచ్చు.. ఎంతమంది మంది అనేది మాత్రం క‌చ్చితంగా తెలియ‌దు అన్నారు. భారతీయులతో పాటు ఇత‌ర దేశాల వాసుల‌ను కూడా భారత్‌కు తీసుకొచ్చిన‌ట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories