నేడు, రేపు బెంగళూరులో విపక్షాల భేటీ

Opposition meeting in Bengaluru today and tomorrow
x

నేడు, రేపు బెంగళూరులో విపక్షాల భేటీ

Highlights

*విపక్షాల సమావేశానికి 24 పార్టీలు హాజరు

Bengaluru Opposition meet: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రోడ్ మ్యాప్‌ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్.. మరో కీలక భేటీకి సిద్ధమవుతోంది. ఇవాళ, రేపు బెంగళూరులో విపక్ష పార్టీలు మరోసారి భేటీకానున్నాయి. ఈ సమావేశానికి పలు పార్టీల కీలక నేతలు హాజరుకానున్నారు. సోనియాగాంధీ స్వయంగా ఫోన్‌ చేసి, సోమవారం జరిపే విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే... ఆమె తన కాలి గాయం కారణంగా నేరుగా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. బిహార్‌ సమావేశంలో పాల్గొనని ఆర్‌ఎల్‌డీ, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ పార్టీలు బెంగళూరు భేటీకి హాజరవుతాయి.

తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు... భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సహా.. ఆయా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు.

దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉండి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానికి సవాల్‌గా నిలుస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడు ఎవరనేది తగిన సమయంలో వెల్లడవుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories