Bengal Elections 2021: బెంగాల్, అసోంలలో కొనసాగుతోన్న రెండో దశ పోలింగ్‌

Ongoing Second Phase Polling in Bengal and Assam
x

Representational Image

Highlights

Bengal Elections 2021: పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరగనుంది.

Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్, అసోంలలో రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరగనుంది. బెంగాల్‌లో ఇవాళ 30 నియోజకవర్గాలకు ఓటింగ్ ప్రారంభమైంది. 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మమతా బెనర్జీ-సువేందు అధికారి నువ్వానేనా అన్నట్లు తలపడిన నందిగ్రామ్ తీర్పు సైతం ఇవాళ ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.రెండో దశలో భాగంగా బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలు, బంకురా, పూర్వ మెద్నీపూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

ఇక అసోంలో కూడా రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 39 నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. 345 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అధికారం నిలుపుకోవాలని బీజేపీ చూస్తుండగా అసోంను మళ్లీ చేజిక్కించుకోవాలని కాంగ్రెస్​భావిస్తున్న తరుణంలో అసోం ఓటర్లు తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. అసోంలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఐదుగురు ప్రతిపక్ష నేతలు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10వేల 592 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories