హిజాబ్ వివాదంపై కొనసాగుతున్న రగడ

Ongoing raga on hijab controversy
x

హిజాబ్ వివాదంపై కొనసాగుతున్న రగడ

Highlights

Karnataka: ఇవాళ హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ.

Karnataka: హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అయితే హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హిజాబ్ వివాదాన్ని జాతీయ అంశంగా మార్చే ప్రయత్నం చేయొద్దని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు. ఇప్పటికిప్పుడు అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, కర్ణాటక హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాతనే విచారిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో దాఖలైన అత్యవసర పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు. ఇక తదుపరి విచారనను ఫిబ్రవరి 14కు వాయిదా వేశారు.

మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణను కొనసాగిస్తున్నందున, ఈనెల 16 వరకు ఉన్నత విద్యా శాఖ పరిధిలోని కళాశాలలు మూసివేయబడతాయని ప్రకటించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, డిప్లొమా, ఇంజినీరింగ్ కాలేజీలకు సెలవురు వర్తిస్తాయి. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక ప్రజలంతా శాంతియూత వాతావరణానికి సహకరించాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇవాళ హిజాబ్ వివాదంపై హైకోర్టులో విచారణ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories