యూపీలో కొనసాగుతున్న తొలి దశ అసెంబ్లీ పోలింగ్

Ongoing First Phase Assembly Polling in UP
x

యూపీలో కొనసాగుతున్న తొలి దశ అసెంబ్లీ పోలింగ్

Highlights

UP: 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు, కోవిడ్‌ నిబంధనలతో ఎన్నికల నిర్వహణ.

UP: యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తొలిదశ పోలింగ్‌లో ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆర్ఎల్డీ-ఎస్పీ దోస్తీతో ఈ దఫా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారింది.అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ బరిలో.. బీజేపీ, కాంగ్రెస్‌, ఎస్పీ- ఆర్‌ఎల్డీ, ఆప్‌, ఎంఐఎం పార్టీలు పోటీలో ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 58 సీట్లకు పోలింగ్‌ జరగ్గా బీజేపీ 53 చోట్ల గెలుపొందింది.. చెరో 2 స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ, ఒక స్థానంలో ఆర్‌ఎల్డీ గెలుపొందాయి.

తొలిదశ బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లోని 9 మంది అభ్యర్థులు ​తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేబినెట్‌ మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్‌ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులు తొలిదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories