స‌రిహ‌ద్దులో బ‌రితెగించిన పాక్‌.. అమరుడైన జవాన్

స‌రిహ‌ద్దులో బ‌రితెగించిన పాక్‌.. అమరుడైన జవాన్
x
Highlights

పూంచ్ సెక్టార్‌ లో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ఆదివారం ఉదయం పాకిస్తాన్ కాల్పులకు తెగబడటమే కాకుండా.. మోర్టార్లతో దాడి చేసింది.

పూంచ్ సెక్టార్‌ లో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ఆదివారం ఉదయం పాకిస్తాన్ కాల్పులకు తెగబడటమే కాకుండా.. మోర్టార్లతో దాడి చేసింది. ఇందులో ఒక భారతీయ సైనికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పూంచ్ , రాజౌరిలలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరపడంతో ఈ నెలలో ముగ్గురు సైనికుల అమరవీరులయ్యారు. కాగా స‌రిహ‌ద్దుల వెంబ‌డి పాక్ ప‌దే ప‌దే కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతోందని భార‌త‌ ర‌క్ష‌ణ శాఖ అధికార ప్ర‌తినిధి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ దేవేంద‌ర్ ఆనంద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

శనివారం కూడా పాకిస్తాన్ నుంచి కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇందులో ముగ్గురు సైనికులు గాయపడ్డారని వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. ఇక ఈ ఏడాది జూన్ మొద‌టి ప‌ది రోజుల్లోనే 114 సార్లు కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డింద‌ని వెల్ల‌డించారు. గ‌డిచిన ఆరునెల‌ల్లో 2 వేల సార్ల‌కు పైగా కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింద‌ని అధికారులు వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం కూడా తగిన సమాధానం ఇస్తోంది. భారత్ కు చెందిన భద్రతా జరిపిన కాల్పులలో పాక్ కు చెందిన జవాన్లు గాయపడ్డారు. అక్కడక్కడా కొందరు మృతిచెందారని కూడా తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories