Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్ టెన్షన్.. రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచన

Omicron Cases Tension in India Increasing Day by Day and Central Govt Gave Omicron Guidelines | National News
x

Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్ టెన్షన్.. రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచన

Highlights

Omicron Cases in India: అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ...

Omicron Cases in India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ లేఖ రాశారు. కొవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని... వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటీవిటి రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. మరో 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతంగా నమోదైనట్లు లేఖలో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.

జిల్లాల్లో కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు గుర్తిస్తే... వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలని సూచించింది. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని... కంటైన్‌మెంట్ జోన్లుగా పరిగణించి... అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచించింది. జనసమూహాలు, పెళ్లిల్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories