Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక

Om Birla Elected as Lok Sabha Speaker
x

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక

Highlights

Lok Sabha Speaker: 18వ లోక్‌సభ సమావేశాలు వరుసగా మూడో రోజు ప్రారంభమయ్యాయి.

Lok Sabha Speaker: 18వ లోక్‌సభ సమావేశాలు వరుసగా మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమవగానే లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టారు. స్పీకర్‌గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేష్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.

లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. 17వ లోక్‌సభ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు ప్రధాని మోడీ. గత ఐదేళ్ల కాలంలో ఓంబిర్లా నేతృత్వంలో కీలక బిల్లులు ఆమోదించబడ్డాయని తెలిపారు. వికసిత్ భారత్‌ దిశగా భారత్ అడుగులేస్తున్న తరుణంలో ఓం బిర్లా మరోసారి స్పీకర్ పదవి చేపట్టారని.. ఐదేళ్లు ఆయన సూచనలు సభను సజావుగా సాగేలా చూడాలని ఆకాంక్షించారు.

ఇక స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ ‌గాంధీ అభినందనలు తెలిపారు. సభ నిర్వహణకు తమ మద్దతు ఉంటుందని.. స్పీకర్ నేతృత్వంలో ప్రతిపక్షానికి ప్రజాగళం వినిపించే అవకాశాలు ఇవ్వాలని కోరారు. సభలో తమ బలం గతంలో కంటే పెరిగిందని.. ప్రజల తరపున వాయిస్ వినిపించే అవకాశం ఇస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు రాహుల్.

Show Full Article
Print Article
Next Story
More Stories