నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. దేశానికి క్షమాపణలు చెప్పాలి

Nupur Sharma Should Apologise To Country Says Supreme Court
x

నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. దేశానికి క్షమాపణలు చెప్పాలి 

Highlights

Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఫైర్ అయింది. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించింది. మీడియా ద్వారా నుపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. పార్టీ అధికార ప్రతినిధి అయినంత మాత్రానా ఏదిపడితే అది మాట్లాడతారా అని చురకలు అంటించింది.

నుపుర్ శర్మ పిటిషన్లు బట్టి చూస్తే న్యాయమూర్తులను కూడా ఆమె చాలా తక్కువగా భావిస్తున్నట్లు తెలుస్తుందంది సుప్రీం. దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లకు నుపుర్ శర్మనే బాధ్యురాలంది. నపూర్ శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయని జ‌స్టిస్ సూర్య కాంత్ త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డ్డారు. దేశవ్యాప్తంగా తనపై నమోదైన FIRలన్నింటినీ దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. తనకు నిత్యం ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ పిటిష‌న్‌పై అత్యున్నత న్యాయ‌స్థానం స్పందిస్తూ శర్మ అభ్యర్థనను తోసిపుచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories