కరోనా కాటుకు బలైన పద్మశ్రీ అవార్డు గ్రహీత

కరోనా కాటుకు బలైన పద్మశ్రీ అవార్డు గ్రహీత
x
Highlights

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా కరోనా భారిన పడి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరణించారు. అటామిక్ ఎనర్జీ..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా కరోనా భారిన పడి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరణించారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ బసు గురువారం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. 2014 లో పద్మశ్రీ అవార్డు పొందిన డాక్టర్ బసు.. ఇటీవల కోవిడ్ -19 మరియు ఇతర మూత్రపిండాల అనారోగ్యంతో బాధపడుతున్నారని అధికారి వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. అయితే ఆయన గురువారమే చికిత్స పొందుతూ తెల్లవారుజూమున 4 గంటల 30 నిమిషాలకు మరణించారని పేర్కొంది. మెకానికల్ ఇంజనీర్ అయిన డాక్టర్ బసు.. దేశంలో అణు ఇంధన అభివృద్ధికి బాగా కృషి చేశారు. ఇంధన రంగంలో ఆయన చేసిన కృషికి గౌరవంగా.. కేంద్రప్రభుత్వం 2014 లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

ఇదిలావుంటే దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 86,508 కేసులు నమోదు కాగా, 1129 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 87,374 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 లక్షల 32 వేలు దాటింది.

Show Full Article
Print Article
Next Story
More Stories