NRIs income: అమెరికాలోనూ సంపాదనలో ముందు వరుసలో మనోళ్లే!

NRIs income: అమెరికాలోనూ సంపాదనలో ముందు వరుసలో మనోళ్లే!
x
Highlights

NRIs income is increased in America: ఎక్కడికెళ్లినా కష్టపడే మనస్తత్వం ఉంటే ఏదైనా సాధించగలమని మరోసారి నిరూపించారు భారతీయులు.

NRIs Income | ఎక్కడికెళ్లినా కష్టపడే మనస్తత్వం ఉంటే ఏదైనా సాధించగలమని మరోసారి నిరూపించారు భారతీయులు. అమెరికాలో స్థిరపడిన మిగిలిన దేశాల అందరికంటే భారతీయులు అధిక ఆదాయం సాధిస్తున్న వారిలో ముందంజలో ఉన్నారు. ఇదే కాదు.. విద్యను అభ్యసించడంలోనూ ప్రధమంలో నిలిచి అక్కడి అమెరికన్లను చివరి వరుసలో నిలబెట్టిన ఘనత భారత్ కే దక్కుతుందని అమెరికన్ నిర్వహించిన కమ్యూనిటీ సర్వేలో తేలింది.

ప్రపంచ దేశాల్లోని పలువురు విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారులకు అమెరికా వెళ్లాలన్నది కల. దాన్ని నెరవేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ, వెళ్లిన వారిలో అంతా ఆర్థికంగా స్థితిమంతులు కాలేరు. భారతీయులు మాత్రం ఆదాయంలో ఎక్కడా తగ్గడం లేదు. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉండటం.. వివిధ రంగాల్లో మనోళ్లకున్న ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు నమోదుచేస్తుంది. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు. ఈ వివరాల ప్రకారం.. అక్కడ స్థిరపడ్డ ఇండియన్‌ అమెరికన్ల ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్‌ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్‌ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం విశేషం.

అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల ఆదాయం ఏటా..

ఇండియన్‌ 1,00,500

ఫిలిప్పో 83,300

తైవానీస్‌ 82,500

శ్రీలంకన్‌ 74,600

జపనీస్‌ 72,300

మలేసియన్‌ 70,300

చైనీస్‌ 69,100

పాకిస్తాన్‌ 66,200

వైట్‌–అమెరికన్లు 59,900

కొరియన్‌ 59,200

ఇండోనేసియన్‌ 57,500

స్థానిక–అమెరికన్లు 56,200

థాయ్‌లాండ్‌ 55,000

బంగ్లాదేశీ 50,000

నేపాలీ 43,500

లాటినో 43,000

ఆఫ్రికన్‌ –అమెరికన్లు 35,000

భారతీయులు బుద్ధిమంతులే కాదు, విద్యావంతులు కూడా. అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచ్‌లర్‌ డిగ్రీ ఉన్న వారిలోనూ ఇండియన్లే నంబర్‌వన్. ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం.

ఇండియన్‌ – అమెరికన్లు 70 %

కొరియన్‌ – అమెరికన్లు 53 %

చైనీస్‌ – అమెరికన్లు 51 %

ఫిలిప్పో – అమెరికన్లు 47 %

జపనీస్‌ – అమెరికన్లు 46 %

సగటు అమెరికన్లు 28 %

Show Full Article
Print Article
Next Story
More Stories