Twin Towers: ట్విన్‌ టవర్ల కూల్చివేతకు సర్వం సిద్ధం

Noida Supertech Twin Towers Demolition
x

Twin Towers: ట్విన్‌ టవర్ల కూల్చివేతకు సర్వం సిద్ధం

Highlights

Twin Towers: కూల్చివేతకు సిద్ధం..40 ఫ్లోర్‌..9సెకన్లలో స్మాష్..

Twin Towers: నొయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో 40 అంతస్తుల జంట టవర్లను నేలమట్టం చేయనున్నారు. ఢిల్లీకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్‌ కంపెనీ నిర్మించిన రెండు భవనాలను అధికారులు కూల్చివేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ కూల్చివేత ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ట్విన్ టవర్స్‌ ను కేవలం 10 నుంచి 13 సెకన్లలో నేలమట్టం చేయనున్నారు.

ఈ టవర్లను కూల్చివేసేందుకు 3వేల 500 కేజీల పేలుడు పదార్థాలను అమర్చారు. వీటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భవనాల్లో ఉంటున్న వాళ్లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల బిల్డింగ్స్‌ను ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. ఈ జంట భవనాలు 100 మీటర్ల ఎత్తు ఉన్నాయి. చుట్టూ 500 మీటర్ల మేర జనసంచారం లేకుండా అధికారుల చర్యలు చేపడుతున్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫైర్‌ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. సమీపంలోని హైవేపై వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు.

ట్విన్ టవర్స్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలో విమానాలు ఎగరకుండా చర్యలు తీసుకున్నారు. ఈ టవర్ల కూల్చివేత బాధ్యతలను నొయిడా అధికారులు.. ఎడిఫైస్ ఇంజనీరింగ్, వైబ్రోటెక్ సంస్థలకు ఇచ్చింది. దీన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్‌ నుంచి నిపుణుల్ని రప్పించింది. ఇక కూల్చివేతతో 25 వేల క్యూబిక్‌ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వాటి తొలగింపునకు కనీసం మూడు నెలల సమయం పట్టనుందని తెలుస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకూ జరిగిన కూల్చివేతల్లో ఇదే అతిపెద్ద కూల్చివేత కానుంది.

ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని సెక్టార్‌ 93లో సూపర్‌ టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ ట్విన్‌ టవర్స్‌ను నిర్మించింది. 2009లో నోయిడా అధికారులతో కలిసి ట్విన్ టవర్స్ ను నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పు ఇచ్చింది.

ఈ జంట భవనాలు కూలుతున్న సమయంలో దుమ్మూ, ధూళి పైకి ఎగరకుండా ఆ ప్రాంతంలో ఇను జాలీలు, కవర్లతో కప్పిం ఉంచారు. ఈ కూల్చివేతలో ఈ భవనాలకు 50 నుంచి 70 మీటర్ల దూరంలో ఉండి బటన్‌ నొప్పి, కేవలం 9 సెకన్లలోనే పేల్చివేత ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

ఏళ్ల తరబడి ఆలోచన.. ఇంజనీర్ల ప్లాన్లు.. వందల నుంచి వేల మంది కూలీల కష్టం. దాదాపు మూడేళ్లపాటు శ్రమించి నిర్మించిన బిల్డింగులు. అలాంటి ఆకాశ హర్మ్యాలను కేవలం.. తొమ్మిది నుంచి 12 సెకండ్లలో నేలమట్టం నేల మట్టం చేయబోతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories