Aadhaar: ఈ పనులకు ఆధార్‌ కార్డ్‌ కచ్చితంగా అససరం..! లేదంటే జరగవు..?

No Work can be Done in the Country Without an Aadhaar Card Government Work is Absolutely Necessary
x

Aadhaar: ఈ పనులకు ఆధార్‌ కార్డ్‌ కచ్చితంగా అససరం..! లేదంటే జరగవు..?

Highlights

Aadhaar: దేశంలో ఆధార్‌ కార్డు లేనిది ఏ పని జరుగదు. పుట్టిన పిల్లాడి నుంచి వందేళ్ల వృద్దుడి వరకు ఆధార్‌ అవసరం.

Aadhaar: దేశంలో ఆధార్‌ కార్డు లేనిది ఏ పని జరుగదు. పుట్టిన పిల్లాడి నుంచి వందేళ్ల వృద్దుడి వరకు ఆధార్‌ అవసరం. పేదవాడికి ఆధార్‌ ఎంత అవసరమో ధనవంతుడికి అంతే అవసరం. ఆధార్ భారత పౌరసత్వానికి గుర్తింపు కానప్పటికీ ఇదిలేనిది ఏ పని జరుగదు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆధార్ కార్డ్‌లో12 అంకెల విశిష్ట సంఖ్యను జారీ చేస్తుంది. ఆధార్‌ గుర్తింపునకు, చిరునామాకు రుజువుగా చెప్పవచ్చు. టెక్నాలజి పెరిగినప్పటి నుంచి దీని అవసరం ఇంకా పెరిగిందనే చెప్పాలి.

ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కచ్చితంగా అవసరం. లేదంటే ఎటువంటి ప్రయోజనాలు లభించవు. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు అభివృద్ధి పథకాలకు ఆధార్‌ అవసరం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన, ఇందిరా ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకాలకు ఆధార్‌ అవసరం. సర్వశిక్షా అభియాన్, విద్యాహక్కు పొందడానికి ఆధార్‌ అవసరం.

సామాజిక భద్రత- జననీ సురక్ష యోజన, గిరిజన సమూహాల అభివృద్ధి పథకం, ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాలలో చేరడానికి ఆధార్‌ అవసరం. జాతీయ ఆరోగ్య బీమా పథకం, జనశ్రీ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన ప్రయోజనాలు పొందడానికి ఆధార్‌ అవసరం. ఆస్తి బదిలీ, గుర్తింపు కార్డు, పాన్ కార్డ్ మొదలైన వాటితో సహా ఇతర ప్రయోజనాల కోసం ఆధార్‌ కావాలి. అంతే కాకుండా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళితే అక్కడ కూడా గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డు అడుగుతారు.

కొత్త మొబైల్ నంబర్, రుణం, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, నీటి కనెక్షన్, ఇంటి కొనుగోలు, అమ్మకం, బ్యాంక్ ఖాతా తెరవడం, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి అన్ని అవసరమైన పత్రాల తయారీకి ఆధార్ తప్పని సరి అవసరం పడుతుంది. ఇదొక్కటే కాదు.. పాఠశాల-కళాశాలలో ప్రవేశం పొందడానికి ఆధార్ అవసరం. ఇవే కాకుండా ఇంకా చాలా పనులకు ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరిగా అడుగుతారు. ఇది లేనిదే ఏ పని జరుగదు. అందుకే ప్రతి ఒక్కరు ఆధార్‌ కార్డ్‌ని పొందాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories