రిజర్వేషన్ లేకుంటే నో సీట్..

రిజర్వేషన్ లేకుంటే నో సీట్..
x
Piyush Goyal (File Photo)
Highlights

దేశంలో 68 రోజుల లాక్డౌన్ తరువాత, నేటినుంచి 200 ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తోంది భారతీయ రైల్వే. అయితే ఈ రైళ్లలో కూర్చువాలి అంటే రిజర్వేషన్లు...

దేశంలో 68 రోజుల లాక్డౌన్ తరువాత, నేటినుంచి 200 ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తోంది భారతీయ రైల్వే. అయితే ఈ రైళ్లలో కూర్చువాలి అంటే రిజర్వేషన్లు తప్పనిసరి అని రైల్వే, వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అన్నారు. రిజర్వేషన్లు లేకుండా ఈ రైళ్లలో కూర్చోవడానికి ఎవరిని అనుమతించడబడదని ఆయన స్పష్టం చేశారు. ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు మాత్రమే రిజర్వ్ బోగీలలో కూర్చుంటారని.. వెయిటింగ్ లిస్ట్ టికెట్ల ప్రవేశం లేదని చెప్పారు. అలాగే సాధారణ బోగీలలో కూడా, సీట్ల సంఖ్య కంటే ఎక్కువ మంది ఎక్కడానికి అనుమతించబడరని అన్నారు..

డిమాండ్ పెరిగేకొద్దీ రైళ్ల సంఖ్య పెరుగుతుందన్న మంత్రి.. ఇప్పుడు నడుపుతున్న 200 రైళ్లలో కూడా పూర్తిగా పాసెంజర్లు రాలేదని. అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలు ప్రయాణిస్తున్నారని అన్నారు. ఇక లాక్డౌన్ సమయంలో, మార్చి 24 నుండి మే 25 వరకు రెండు నెలల్లో 24 మిలియన్ టన్నుల వస్తువులు రవాణా చేయబడ్డాయని.. దేశంలోని ఎక్కడా కూడా ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గు కొరత లేదని ఆయన అన్నారు. గూడ్స్ ల ద్వారా వస్తువులను దేశంలోని ప్రతి మూలకు పంపిస్తున్నామని అని పీయూష్ గోయెల్ అన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories