బీహార్ మంత్రివర్గం రాజీనామా!

బీహార్ మంత్రివర్గం రాజీనామా!
x
Highlights

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్‌ని కలిశారు. ఈ సందర్బంగా తన మంత్రివర్గ రాజీనామాను గవర్నర్ కి సమర్పించి అసెంబ్లీని రద్దు చేయాలనీ కోరారు.

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్‌ని కలిశారు. ఈ సందర్బంగా తన మంత్రివర్గ రాజీనామాను గవర్నర్ కి సమర్పించి అసెంబ్లీని రద్దు చేయాలనీ కోరారు. దీనితో బీహార్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక నితీష్ కుమార్ రాజీనామా లేఖను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వంఏర్పాటు అయ్యేవరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.

అంతకుముందు నితీష్ కుమార్ సీఎం అధికార నివాసంలో న్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్‌ఏఎం, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీల నాయకులు భేటీ అయ్యారు. ఇక ఇటివల జరిగిన బీహార్ ఎన్నికలలో జేడీయూ కన్నా బీజేపీ 32 స్థానాలను ఎక్కువగా గెలుచుకుంది. అయినప్పటికి నితీష్ కుమార్ సీఎంగా ఉంటారని బీజేపీ అధిష్టానం ప్రకటించడం విశేషం.. అటు ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్‌ చౌపాల్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories