రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గిరి కోసం బీజేపీ వ్యూహాలు.. ఏపీలో వైసీపీ..

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గిరి కోసం బీజేపీ వ్యూహాలు.. ఏపీలో వైసీపీ..
x
Highlights

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. డిప్యూటీ చైర్మన్ గిరిని ఏకగ్రీవం చేసుకోవాలని ఎన్డీఏ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో..

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. డిప్యూటీ చైర్మన్ గిరిని ఏకగ్రీవం చేసుకోవాలని ఎన్డీఏ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదనే విధంగా సీనియర్ నేతలను రంగంలోకి దింపింది, దీనిలో భాగంగానే బిజూ జనతా దళ్(బీజేడీ‌) అధ్యక్షుడు , ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సాయం కోరింది. బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ గురువారం నవీన్‌ పట్నాయక్‌కు ఫోన్‌ చేసి.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. అయితే దీనిపై పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని నవీన్ తెలిపారు. కాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉంది.

బీజేపీ మిత్రపక్షం జేడీయూకు చెందిన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ను ఎన్డీయే అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిపింది. మొత్తం 245 సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 114 మంది ఉన్నారు. మాజిక్ ఫిగర్ దాటాలంటే 124 ఓట్లు కావాలి. ప్రస్తుతం బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీల బలం సహా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ , తెలంగాణలో తెరాస పార్టీలు ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ఇస్తే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. దాంతో ఎట్టిపరిస్థితులలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. నామినేషన్ల ప్రక్రియకు రేపు (శుక్రవారం) ఆఖరి రోజు కావడంతో ఇవాళ రాత్రికి లేదంటే రేపు ఉదయానికల్లా అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories