Nisith Pramanik: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Nisith Pramanik Car Attacked in West Bengal
x

Nisith Pramanik: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Highlights

Nisith Pramanik: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Nisith Pramanik: కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో పర్యటనకు వెళ్లిన కేంద్రమంత్రి నిశిత్‌ను తృణమూల్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి.. మంత్రికి నల్లజెండాలతో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. బెంగాల్‌లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి నిశిత్ మండిపడ్డారు. కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల భద్రత గురించి ఊహించుకోవచ్చని విమర్శించారు. తన కాన్వాయ్‌పై జరిగిన దాడి సంఘటన బెంగాల్‌లో ప్రజాస్వామ్య పరిస్థితికి నిదర్శనమని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories