Nirmala Sitharaman: పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించిన నిర్మలా

Nirmala Sitharaman presented the Economic Survey in Parliament
x

Nirmala Sitharaman: పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించిన నిర్మలా

Highlights

Nirmala Sitharaman: ఆర్థిక సర్వేలో కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం

Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆర్ధిక సర్వేను సమర్పించింది. సభ ముందుంచిన ఈ ఆర్ధిక సర్వేలో ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. ఆర్ధిక వ్యవస్ధ సానుకూల సంకేతాలతో మెరుగైన వృద్ధి రేటును సాధించనున్నట్టు తెలిపింది. 2024-25లో 6.5-7 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. 2023 ఆర్ధిక సంవత్సరంలో వెల్లడైన ఆర్ధిక ఉత్తేజం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్ధిక వ్యవస్ధ స్ధిరత్వాన్ని కొనసాగిస్తూ వాటి ప్రభావాలను దేశ ఆర్ధిక వ్యవస్ధపై పడకుండా నిరోధిస్తుందని పేర్కొంది. నిలకడైన వినిమయ డిమాండ్‌, ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్‌ ఊతంగా 2024-25 ఆర్ధిక సంవత్సరంలోనూ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories