కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌.. రాష‌్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు కఠినతరం.. భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?

Nipah Virus Puts Kerala Under Siege
x

కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌.. రాష‌్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు కఠినతరం.. భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?

Highlights

Kerala: కరోనా కంటే.. ప్రమాదకరమైన నిఫా వైరస్‌ అలజడి సృష్టిస్తోంది.

Kerala: కరోనా కంటే.. ప్రమాదకరమైన నిఫా వైరస్‌ అలజడి సృష్టిస్తోంది. తాజాగా కేరళలో మహమ్మారి తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కోజికోడ్‌ జిల్లాలో పరిస్థితులు దారుణంగా మారాయి. వైరస్ బారిన పడి... ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. తాజా ఈ జిల్లాలో ఏకంగా లాక్‌డౌన్ అమలవుతోంది. స్కూల్లు, దుకాణాలు, ఆఫీసులు మూతపడ్డాయి. జిల్లా మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిలో నిఫా బాధితుల కోసం 75 ఐసోలేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లాలో మొత్తం 950 మందికి నిఫా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారిలో 231 మందిని హైరిస్క్‌ కేటగిరిలో ఉంచారు. 21 మందిని మాత్రం చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేర్చారు. పరిణామాలపై ఆ కేరళ ప్రభుత్వం స్పందించింది. ప్రజలందరూ మాస్కులను ధరించాలని సూచించింది. బహిరంగ సమావేశాలు, సామూహిక కార్యక్రమాలను రద్దు చేసింది. మెడికల్‌ సిబ్బందిని హైఅల్టర్‌లో ఉంచింది. దీంతో ఏదో జరుగుతోందన్న అందోళన ప్రజల్లో మొదలైంది. మళ్లీ మహమ్మారి తప్పదా? అన్న భయాందోళనలు అందరినీ వెంటాడుతున్నాయి.

కోవిడ్‌ తరువాత.. వైరస్ అంటే.. ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా దేశంలో మరో వైరస్‌ కలకలం సృస్టిస్తోంది. నిఫా వైరస్‌ కేరళను వణికిస్తోంది. ఇప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తాజా పరిస్థితులను చూస్తుంటే.. కరోనా నాటి లాక్‌డౌన్‌ గుర్తొస్తోంది. ప్రస్తుతం నిఫా వైరస్‌ సోకి.. కేరళలో ఇద్దరు వ్యక్తి చనిపోయారు. కేరళలో 39 ఏళ్ల వ్యక్తికి నిఫా సోకినట్టు నిర్ధారించారు. ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. మరో నాలుగు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అదే సమయంలో 60 ఏళ్ల మహిళకు కూడా ఈ వైరస్‌ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఇప్పుడు పాజిటివ్‌గా నిర్ధారించబడిన వ్యక్తి.. ప్రస్తుతం కోజికోడ్‌లోని ఆసుపత్రిలో పరిశీలనలో పరిశీలించారు. అంతకుమందు బాధిత వ్యక్తి అదే ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడి.. ఆగస్టు 30 ఒకరు, సెప్టెంబరు 11న మరొకరు చనిపోయారు. మరణించిన మొదటి వ్యక్తికి చెందిన బంధువుల్లో ఇద్దరు కూడా ఆసుపత్రి పాలయ్యారు. వారిలోనూ నిఫా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించారు. వైరస్‌ బాధితుల కాంటాక్టులను ఆరోగ్య కార్యకర్తలు ట్రాక్ చేస్తున్నారు. నిఫా లక్షణాలు ఉన్న మొత్తం 950 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 950 మందిలో 231 మందిని హైరిస్క్‌ కేటగిరీలో ఉంచారు. 21 మందిని ఆసుపత్రిల్లో చేర్చారు.

తాజా పరిణామా కేరళలో కలకలం రేపుతోంది. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వ అప్రమత్తమైంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ ప్రభుత్వం సూచిస్తుంది. తాజాగా కేరళలో మాస్కులు మళ్లీ కనిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరి మాస్కులను ధరించాలంటూ.. పర్యాటకులకు కేరళ ప్రభుత్వం సూచించింది. కేరళ సరిహద్దుల్లో వైరస్‌ తనిఖీలను మరింత కఠినతరం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బహిరంగ సమావేశాలు, సామూహిక కార్యక్రమాలు జరుపుకోరాదని ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి కేరళలో ఇప్పుడు పర్యాటకానికి మంచి సీజన్‌. ఈ సమయంలో వైరస్‌ వ్యాపించడం.. దేశ వ్యాప్తంగా భయాందోళనలను సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ విషయంలో కోజికోడ్‌ జిల్లాలో నిఘా ఎక్కువగా ఉంది. అయితే వైరస్‌ ఎక్కువగా ఎక్కడ వ్యాపించింది? అంటే.. కోజికోడ్‌ జిల్లాలోని తొమ్మిది గ్రామాలను ప్రభుత్వం కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచిలా ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో మాత్రమే దుకాణాలు పని చేస్తాయి. ప్రజలు కూడా ఆ సమయంలోనే తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఫార్మసీలు, ఆరోగ్య కేంద్రాలకు మాత్రం ఎలాంటి నియమాలను విధించలేదు. కానీ.. పలు చోట్ల ప్రజలే స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. కోజికోడ్‌ జిల్లాలో దాదాపు లాక్‌డౌన్‌ అమలవుతోంది. మరోవైపు నిత్యం వందలాది మంది గుర్తింపు పొందిన సమాజిక ఆరోగ్య కార్యకర్తలు.. ఆయా ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి డేటాను సేకరిస్తున్నారు.

నిఫా పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో కంటైన్‌మెంట్‌ జోన్లకు రాకపోకలను నిషేధించారు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేశారు. వేడుకలు, సమావేశాలు, ఇతర బహిరంగ కార్యక్రమాలను సెప్టెంబరు 24వరకు ప్రభుత్వం నిషేధించింది. లాక్‌డౌన్‌ సమయంలో విధించినట్టుగా.. తాజాగా విద్యార్థులకు అన్‌లైన్ క్లాసులను తిరిగి ప్రారంభించారు.

మరోవైపు రోగుల సంఖ్య పెరిగితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో 75 ఐసోలేషన్‌ గదులు, ఆరు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, నాలుగు వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచారు. మరోవైపు కేరళలోని నిఫా విజృంభణపై ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌-ఐసీఎంఆర్‌ స్పందించింది. నిఫా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొనడానికి కేరళకు యాంటీ వైరల్‌ ఔషధాలను సరఫరా చేసింది. నిజానికి నిఫా వైరస్‌కు ఎలాంటి మందులు లేవని వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం తప్ప మరో మార్గం లేదని తెలిపింది.. అందుకే ఈ వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు మొబైల్‌ ప్రయోగశాలలను కూడా ఐసీఎంఆర్ పంపింది. ఆస్ట్రేలియా నుంచి 20 డోసుల మోనోక్లోనల్‌ యాంటీ బాడీని కూడా భారత్‌ తెప్పించింది. తాజా పరిణామాలతో దేశ వ్యాప్తంగా భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరోనా కంటే దారుణంగా నిఫా వైరస్‌ వ్యాపిస్తుంది. నిజానికి నిఫా జూనోటిక్‌ వైరస్‌. అంటే.. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధని.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుందని ఐసీఎంఆర్ వెల్లడించింది.

ప్రాథమికంగా నిఫా గబ్బిలాల నుంచి వ్యాపించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా గబ్బిలాలు పండ్లను తింటాయి. అవి పూర్తిగా తినకుండా కొంచెమే కొరికి పడేస్తాయి. ఈ క్రమంలో వైరస్‌ సోకిన గబ్బిలాలు తిన్న పళ్లను మనుషులు, జంతువులు తినడంతోనే ఈ వైరస్‌ వ్యాపించినట్టు చెబుతున్నారు. ఈ వైరస్‌ కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, గొర్రెలకు సోకే అవకాశం ఉంది. నిజానికి కోవిడ్‌ లక్షణాలు నాలుగు రోజుల తరువాత కనిపిస్తాయి. కానీ.. నిఫా లక్షణాలు ఒక్కరోజులోనే బయటపడుతాయి. ఈ వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అంటే.. ముందుగా తలనొప్పి మొదలవుతుంది. అనంతరం దగ్గు, గొంతునొప్పి వస్తుంది. కరోనాలాగే నిఫాతో శ్వాసకోస ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఈ వైరస్ ప్రభావం కొన్ని వారాల పాటు ఉంటుంది. ప్రధానంగా ఈ వైరస్‌ మెదడును లక్ష్యంగా చేసుకుంటుంది. బాధితుడి మెదడులో పెద్ద వాపు వస్తుంది. దీంతో మగత, టెన్షన్‌, మానసిక గందరగోళం వంటి లక్షణాలు వేగంగా వ్యాపిస్తాయి. పరిస్థితులు విషమిస్తే.. ఒకటి లేదా రెండ్రోజుల్లో బాధితుడు కోమాలోకి వెళ్లిపోయే ముప్పు ఉంది. దీంతో మరణం కూడా సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ గురించి ఎందుకు భయపడాలి? అంటే.. నిఫా సోకిన వారిలో మరణాలు సంభవించే అవకావం 40 నుంచి 70 శాతం ఉంటుందని ప్రపంచ ఆరోపగ్య సంస్థ చెబుతోంది. కోవిడ్‌లో మరణాలు సంభవించే రేటు కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటుంది.

2001 నుంచి భారత్‌లో ఈ వైరస్‌ ఉనికిలో ఉంది. దేశంలో ఇప్పటివరకు ఆరు సార్లు ఈ వైరస్‌ విజృంభించింది. అందులో కేరళలోనే మూడుసార్లు నిఫా కలకలం సృష్టించింది. కోవిడ్‌ సమయంలోనూ కేరళలో నిఫా కేసుల ఉనికిని గుర్తించారు. గత రెండు దశాబ్దాల్లో నిఫా కారణంగా.. 70 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ నిఫా కారణంగా.. కేరళలో లాక్‌డౌన్‌ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఈ వైరస్‌ వ్యాపిస్తే.. మరో లాక్‌డౌన్‌ తప్పదా? అన్న భయాందోళనలు అందరినీ వెంటాడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories